ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. సంక్షేమ పథకాలకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం , రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. తాను ఇచ్చిన హామీలను నిర్వవేరుస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక భరోసా అందిస్తున్నారు. కాస్త ఆలస్యంగానైనా చెప్పిన పథకాల ద్వారా లబ్ధి దారులకు నగదు అందజేస్తున్నారు. తాజాగా విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త అందిచారు. రేపు జగనన్న వసతి దీవెనకు బటన్ నొక్కి నగదు విడుదల చేయనున్నారు.
బుధవారం అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం కేంద్రంలో జగనన్న వసతి దివేన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పథకం కింద అర్హులైన వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు అందిస్తున్నారు. ఈ నగదును కూడా రెండు వాయిదాల్లో విద్యార్థులకు చెల్లిస్తున్నారు. అలానే పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్,మెడిసిన్ తదితర కోర్సుల చేస్తున్న వారికి రూ20 వేల చొప్పున జగన్ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది.
బుధవారం ఉదయం8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు శింగనమల నియోజవర్గంలో నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎం చేరుకుంటారు. అనంతరం 10.40 నుంచి 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు. ఆ తరువాత జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మరి.. ‘జగనన్న వసతి దీవెన’ కింద విద్యార్థులకు నగదు అందిచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.