దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. కొంత మంది ఈజీ మనీ కి అలవాటు పడ్డవారు అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. స్మగర్లు ఎప్పటికప్పుడు కొత్తగా పోలీసుల కళ్లు గప్పి గంజాయి సరఫరా చేస్తున్నారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు.. గంజాయి స్మగర్లు కూడా కొత్త స్కెచ్ లతో గంజాయిని సిటీలోకి సరఫరా చేస్తున్నారు. విశాఖ జిల్లా బలిమెలలో కొంతమంది స్మగ్లర్లు పరుపులో గంజాయి తరలిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
విశాఖ జిల్లా బలిమెల నుంచి హైదరాబాద్ కు పరుపుల మాటున గంజాయిని తరలిస్తున్నారు. పరుపులు ఆటోలో పెట్టుకొని హైదరాబాద్ కు తీసుకోస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు అజ్ఞాత వ్యక్తి ద్వారా తెలిసింది. పక్కగా స్కెచ్ వేసిన పోలీసులు రోడ్డుపై నిఘా వేసి వాహనాలను తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన ఓ ఆటోను అదుపులోకి తీసుకున్నారు. ఆటొరి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పరుపుల మాటున గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలుసుకున్నారు. పరుపు నిండా గంజాయి ప్యాకెట్లే కనిపించాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.