నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో బాధపడుతూ జీవితాన్ని దుర్భరంగా గడపుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో బాధపడుతూ జీవితాన్ని దుర్భరంగా గడపుతున్నారు. కొందరు మితిమిరిన వేగంతో వాహనం నడిపి తోటి వాహనదారుల, పాదాచారుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి.. ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నజ్జుగా మారింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరుకు చెందిన పసుమర్తి గాంధీ కుటుంబ సభ్యులు శుక్రవారం శ్రీశైలం వెళ్తున్నారు. వీరి కారు పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోకి వచ్చింది. అలానే మిర్చి లోడుతో ఓ లారీ నంద్యాల నుంచి గుంటూరు వెళ్తోంది. వినుకొండ మండలం శివాపురం వద్ద ముందు వెళ్తున్న లారీని దాటి వెళ్లేందుకు వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. లారీని దాటి వెళ్లే క్రమంలో దాని టైర్ పగిలిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న కారును మిర్చి లారీ బలంగా ఢీకొంది. ఆధాటికి లారీ యాక్సిల్ కూడా విరిగిపోయింది. దీంతో కాస్తా దూరం వెళ్లిన లారీ ముందుకు కదలలేదు. ప్రమాదంలో కారు నుజ్జు నజ్జుగా మారింది.
కారులో ప్రయాణిస్తున్న గాంధీ, పసుమర్తి పద్మ, మామిడి ఏడు కొండలుకు తీవ్ర గాయాలయ్యాయి. అలానే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108లో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే అనంతపురం జిల్లాలో ఆటో, కారు ఢీకొని.. ఆరు మంది కూలీలు దుర్మరణం చెందారు. ఇలానే నిత్యం పలు చోట్ల రహదారులు రక్తసిక్తం మారుతున్నాయి. మరి.. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.