నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంపు డ్రైవింగ్ వంటి కారణాలతో తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జుగా మారిపోయింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంపు డ్రైవింగ్ వంటి కారణాలతో తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నరాు. అలానే మరేందరో తీవ్రగాయాలతో జీవితాన్ని చాలా కష్టంగా లాగిస్తున్నారు. ఇటీవలే ఏపీలో ఓ కారును ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరు మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరికొందరికిత తీవ్రగాయాలయ్యాయి. తాజాగా తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జుగా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తిరుపతి ఘాట్ రోడ్డులో ఇనుప పైపుల లోడు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది సమాచారం. అధిక లోడు కారణంగా రోడ్డుపై బోల్తా పడ్డా లారీ నుజ్జు నుజ్జుగా మారింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనలో ఎవరైనా మృతి చెందారా? లేదా గాయలయ్యాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద విషయాన్ని పోలీసులకు అందించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఓ భారీ క్రేన్ ను ఘటన స్థలానికి రప్పించారు. దాని ద్వారా రోడ్డుపై అడ్డంగా పడిన లారీని దానిపై ఉండే ఇనుపలోడ్ ను పక్కకు జరిపారు.
పోలీసు అధికారులు దగ్గరుండి మరి… బోల్తా పడిన లారీని పక్కకు జరిపించారు. అలానే రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పైపులను ఒక వైపు పెట్టేశారు. చాలా సమయం పాటు శ్రమించిన పోలీసులు, ఇతర అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సార్లు బస్సులు, ఇతర వాహనాలు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదాల్లో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే తాజాగా జరిగిన ప్రమాదంలో ఎవరికి ఏం జరిగిందో తెలియాల్సింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయలతో బయట పడినట్లు సమాచారం. మరి.. ఘాట్ రోడ్డు ప్రమాదంలో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.