నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం సేవించడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం సేవించడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో కుటుంబ సభ్యులను కోల్పోయి.. తీవ్ర వేదనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో బస్సులను లారీ ఢీ కొట్టి.. అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం చెందారు. తాజాగా తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బుధవారం తిరుమల నుంచి తిరుపతికి కొందరు భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురైంది. తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా.. మొదటి ఘాట్ రోడ్డులోని మలువు నంబర్ 29, 30 వద్దకు రాగానే బస్సుల ప్రమాదానికి గురైంది. ఆ మలుపు వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 45 మంది శ్రీవారి భక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విధులు ముగించుకుని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించి.. అప్రమత్తమయ్యారు.
వెంటనే వారు స్పందించి.. ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను పగలగొట్టి భక్తులను బయటకు తీశారు. ఎస్పీఎఫ్ సహాయ చర్యలు చేపట్టి.. బస్సులోని భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ , పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయలైనట్లు సమాచారం. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మరి.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు మీ సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.