నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పెట్రోల్, గ్యాస్.. వంటి లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. అవికాస్తా పెను ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా విశాఖ జిల్లాలో ఓ గ్యాస్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయలతో అంగవైకల్యం ఏర్పడి.. జీవితాన్ని నరకప్రాయంగా గడపుతున్నారు. కొన్నిసార్లు పెట్రోల్, గ్యాస్.. వంటి లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. అవికాస్తా పెను ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా విశాఖ జిల్లాలో ఓ గ్యాస్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్ల్లోకి వెళ్తే..
విశాఖపట్నం జిల్లా కంచరపాలెం సమీపంలో హైవేపై ఓ గ్యాస్ లారీ ప్రమాదానికి గురైంది. ఈ ట్యాంకర్ విశాఖలోని ఐవోసీఎల్ నుంచి గ్యాస్ లోడ్ తో రాయ్ పూర్ వెళ్తుంది. ఈక్రమంలోనే కంచరపాలెం హైవేపై ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ఈ గ్యాస్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఒక వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. అలానే ఈ లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హైవేపై లారీ నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గ్యాస్ ట్యాంకర్ ప్రమాదానికి గురికావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చాలా సమయం పాటు అందరూ ఊపిరి బిగపట్టి ఉన్నారు.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే రోడ్డుపై ప్రమాదానికి గురైన గ్యాస్ ట్యాంకర్ ను క్రేన్ సాయంతో అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కారణం ఏదేమైనప్పటికి గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడలేదు కాబట్టి సరిపోయింది.. లేకుంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.