నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, విశ్రాంతి లేకుండా వాహనాల డ్రైవ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగ విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, విశ్రాంతి లేకుండా వాహనాల డ్రైవ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్రగాయాలతో జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. శుక్రవారం మహారాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరెందరో గాయాలతో ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏపీలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో ఆంజనేయ స్వామి గుడి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గురుచరణ్‌సింగ్, చల్లాస్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయంత్, సదబ్ గా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. గాయపడిన వారిని గజపతినగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం అక్కడి నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మహారాష్ట్రలో కూడా బస్సు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తెల్లవారుజాము సమయంలోనే జరుగుతున్నాయి. మరి.. ఈ ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.