ఈ భూమిపై తల్లిప్రేమకు సాటివచ్చేది మరొకటి లేదు. ఎందుకంటే.. తల్లి ప్రేమ అనంతమైనది. నవమాసాలు మోసి బిడ్డను పురిటినొప్పులు భరిస్తూ జన్మనిస్తుంది. బిడ్డలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే.. వారి ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డు వేస్తుంది. తాజాగా ఓ తల్లి.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుమారుడిని కాపాడే ప్రయత్నం చేసింది. తల్లిపై అలిగి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు పట్టాలెక్కాడు కుమారుడు.. కన్నబిడ్డను ఎలాగైనా కాపాడాలని బిడ్డ వెనుక పరుగు తీసిందా ఆ తల్లి.
ఈ భూమిపై తల్లిప్రేమకు సాటివచ్చేది మరొకటి లేదు. ఎందుకంటే.. తల్లి ప్రేమ అనంతమైనది. నవమాసాలు మోసి బిడ్డను పురిటినొప్పులు భరిస్తూ జన్మనిస్తుంది. పిల్లల సుఖం కోసం తాను కష్టాల పడుతుంది. తన సౌకర్యాలను వదులుకుని బిడ్డల అవసరాలను తీరుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. బిడ్డలకు చిన్న గాయామైన తల్లి తల్లడిల్లిపోతుంది. బిడ్డలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే.. వారి ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డు వేస్తుంది. బిడ్డలు పెరిగి పెద్దవారైన.. తల్లికి చిన్నపిల్లలుగానే అనిపిస్తారు. తాజాగా కోపంతో ఆత్మహత్యయత్నం చేసుకునేందుకు రైలుకు ఎదురుగా వెళ్లిన కొడుకును కాపాడే ప్రయత్నం చేసింది ఓ తల్లి. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నవాబు పాలెం గ్రామానికి తచెందిన బొండాడ అప్పారావు, సుబ్బమ్మ(65) దంపతులు. వీరికి వెంకటేశ్వరరావు(47) అనే కుమారుడు ఉన్నాడు. అతడు గతకొన్నేళ్లుగా మానసిక సమస్యతో బాధ పడుతున్నాడు. 12ఏళ్ల క్రితమై వెంకటేశ్వరావు భార్య, ఇద్దరు పిల్లలు ఆయన్ను వదిలి వెళ్లిపోయారు. భార్యాపిల్లలు తనను వదిలివేయడంతో అప్పటి నుంచి తల్లి సుబ్బమ్మ వద్దే ఉంటున్నాడు. ఆమె గ్రామంలో దుస్తులు ఉతుకుతూ భర్త, కుమారుడిని పోషిస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గాలేని వెంకటేశ్వరావు.. అప్పుడప్పుడు తల్లితో గొడవపడి అలుగుతుండే వాడని సమాచారం. అలానే బుధవారం రాత్రి కూడా భోజనంలో కూర వేయలేదని తల్లిపై వెంకటేశ్వరావు అలిగాడు.
అనంతరం ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. గురువారం ఉదయం ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. తల్లినపై కోపపడిందని మనస్తాపానికి గురైన వెంకటేశ్వరరావు ఆత్మయత్న చేసేందుకు సమీపంలోని రైలు పట్టాల వైపు వెళ్లాడు. కుమారుడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అనే భయంతో ఆమె కూడా వెంకటేశ్వరావు వెనుక పరుగులు తీసింది. వెనుక రైలు వస్తున్నా కూడా లెక్కచేయకుండా కుమారుడిని కాపాడాలని ఆ తల్లి ప్రాణాలకు తెగించి మరీ.. పట్టాలపై పరిగెత్తింది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న సింహాద్రి ఎక్స్ ప్రెస్ వెనుక నుంచి తల్లి కుమారుళ్లను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో స్థానికంగా విషాదఛాయాలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.