పెళ్లి అనేది ప్రతి కుటుంబంలో మరపురాని వేడుక. అలాంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్రతి కుటుంబ సభ్యులు కోరుకుంటారు. అయితే ఓ పెళ్లి వేడుకలోని విందు.. 400 మందిని ఆస్పత్రి పాలు చేసింది.
పెళ్లి అనేది ప్రతి కుటుంబంలో మరపురాని వేడుక. అలాంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్రతి కుటుంబ సభ్యులు కోరుకుంటారు. ఇక పెళ్లికి వచ్చిన వారికి రుచికరమైన భోజనాలను వడ్డించాలని అనుకుంటారు. అయితే కొన్నిసందర్భాల్లో భోజనం కలుషితంగా మారి.. పెళ్లికి వచ్చిన వారు అస్వస్థతకు గురవుతుంటారు. తాజాగ విజయనగరం జిల్లాలో కలుషిత భోజనం తిని..400 మంది అస్వస్థత గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామంలో కోట్ల గురునాయుడు మనవడికి పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం గురునాయుడు మనవడి పెళ్లి జరిగింది. స్థానికులు, పెళ్లికి వచ్చిన అతిథులు అందరూ విందుకు సందడిగా వెళ్లారు. ఇక పెళ్లి భోజనాన్ని అందరూ ఎంతో సంతోషంగా ఆరగించారు. కాసేపటి తరువాత కొందరు వాంతులు, విరేచనాలు, తలతిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అంతే.. విందుకు హాజరైన వారందరిలోనూ అలజడి రేగింది. అస్వస్థతకు గురైన సుమారు వంద మందిని అంబులెన్సులో స్థానిక పీహెచ్ సీలకు తరలించి.. చికిత్స అందించారు.
సాధారణ స్థితిలోనే ఉన్న మరో 300 మందికి గ్రామంలోనే వైద్య శిబిరం నిర్వహించారు. అయితే అస్వస్థత గురైన వారిలో ఎవరికి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఎమ్మల్సీ సురేష్ బాబు, ఆర్డీఓ సూర్యకళ, విజయనగరం డీఎస్పీ పరామర్శించారు. విందులో ఆహారం వండిన వారి గురించి.. సరుకులు ఎక్కడ నుంచి తెచ్చారు వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని ఎమ్మార్వోను ఆర్డీఓ ఆదేశించారు. మరి.. ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.