నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ఇతర కారణాలతో ఈ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా నెల్లూరులో కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ మధ్యకాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ఇతర కారణాలతో ఈ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలానే కండీషన్ లేని వాహనాలను రోడ్లపైకి తీసుకు రావడం వలన కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరేందరో తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా నెల్లూరులో కూడా ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపోయింది. అయితే చక్రం ఊడిపోయిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు.. కాకుటూరు వైపు వెళ్తుంది. అయితే నెల్లూరు నగరం దాటిన తరువాత కేవీఆర్ పెట్రోలో బంకు సమీపంలోకి వెళ్లే సరికి ఆర్టీసీ బస్సు చక్రం ఊడి పడింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. చక్రం ఊడిపోవడంతో బస్సు నడి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో చాలా సమయంలో పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ మెకానికల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బస్సుకు చక్రాన్ని తిరిగి అమర్చారు. అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్లింది. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు స్పందించారు.
నెల్లూరు నంచి కాకుటూరు గ్యారేజికి బస్సును తరలిస్తున్న సమయంలో చక్రం ఊడిపోయిందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రిపేర్ చేయించామని వారు తెలిపారు. అలానే ఈ బస్సు కేవలం స్క్రాప్ వాహనమేనని. టైర్ బోల్టులు ఊడిపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు. నెల్లూరు డిపో పరిధిలో ఇలాంటి బస్సులు కొన్ని ఉన్నాయని.. వాటిని కూడా ఒకటి , రెండు రోజుల్లో కాకుటూరు గ్యారెజీకి పంపుతామని అధికారులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ జేయండి.