జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతిపై విధి కన్నెర్ర చేసింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి మృత్యు ఒడిలోకి చేరింది. ఈ ఘోరమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
జీవితంపై ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో యువత ఎన్నో కలల కంటారు. ఆడపిల్లలు తమకు కాబోయే భర్త విషయంలో వ్యక్తిత్వం, అందం, ఆర్థికి స్థితిపై ఎన్నో ఆశలు పెంటుకుంటారు. అలానే ఎందరో యువతులు తమ వివాహానంతరం కొత్త జీవితంలో సంతోషంగా ఉంటున్నారు. ఇలా కోటి ఆశలు పెట్టుకుని పెళ్లి సిద్ధమవుతున్న తరుణంగా విధి చిన్నచూపు చూస్తుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొందరు వధువరులు తిరిగి రాని లోకాల వెళ్తున్నారు. తాజాగా వివాహ నిశ్చితార్ధం చేసుకోవాల్సిన ఓ యువతి నిండు నూరేళ్లు నిండాయి. పాము రూపంలో మృత్యువు వచ్చి ఆమెను బలి తీసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం గుండ్రెపుల గ్రామంలో నారాయణ, వెంకటమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి సరస్వతి అనే కుమార్తె ఉంది. తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో ఆ యువతి చేదోడువాదోడుగా ఉంటుంది. పెళ్లి వయస్సుకు వచ్చిన సరస్వతికి ఇటీవల కొంతకాలం నుంచి సంబంధాలు చూస్తున్నారు. ఈక్రమంలో ఇటీవలే ఓ వివాహ సంబంధం కుదిరింది. ఫిబ్రవరి 22న ఓ యువకుడితో సరస్వతికి నిశ్చితార్థం చేయలని నిర్ణయించారు. పొలం పనులు చూసుకుంటూనే నిశ్చితార్థానికి సంబంధించిన పనులను చూసుకుంటున్నారు నారయణ దంపతులు. నారాయణ దంపతులతో పాటు సరస్వతి మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లింది.
వారందరూ మొక్క జొన్న సొప్పను తీసే పనిలో నిమగ్నమయ్యారు. సరస్వతి కూడా మొక్కజొన్న సొప్ప తీసుకునేందుకు వెళ్లగా.. పొరపాటున కింద ఉన్న పామును తొక్కడంతో కాటు వేసింది. అయితే కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించకుండా.. తిమ్మం దొడ్డిలో నాటు వైద్యం చేయించారు. చాలా సమయం గడిచిపోవడంతో సరస్వతి శరీరమంతా విషం ఎక్కింది. విషం శరీరానికి చేరడంతో నల్లగా మారి మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇంకా చాలా మంది నాటు వైద్యాన్నే నమ్ముతున్నారు. ఇలా నాటు వైద్యం చేయించుకుని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.