తల్లిదండ్రులు.. తమ బిడ్డలను ఎంతో ప్రేమగా, ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అయితే వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇతర సందర్భాల్లో మందలిస్తుంటారు. మనస్తాపం చెంది కొందరు యువత ఇంటి నుంచి పారిపోతున్నారు. అలా వెళ్లిన వారిలో కొందరు అదృశ్యమవుతున్నారు.
తల్లిదండ్రులు.. తమ బిడ్డలను ఎంతో ప్రేమగా, ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అయితే వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇతర సందర్భాల్లో మందలిస్తుంటారు. తల్లిదండ్రులు కోపాలను అర్ధం చేసుకున్న పిల్లలు గొప్పవాళ్లు అవుతున్నారు. మరికొందరు మనస్తాపం చెంది… ఇంటి నుంచి పారిపోతున్నారు. అలానే కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొందరు అదృశ్యమవుతున్నారు. అనంతపురం పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.
అనంతపురం పట్టణంలోని జయనగర్‌కాలనీకి చెందిన బాషాజాన్ అనే వ్యక్తి.. కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు నదీం హుసేన్ (19) అనే కుమారుడు ఉన్నాడు. అతడు వరంగల్‌లోని ఎస్‌ఆర్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల నదీం హుసేన్ అనంతపురంలోని తన ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా సక్రమంగా చదువుకోవడం లేదంటూ నదీం ను బాషాజాన్ మందలించాడు. అనంతరం ఈనెల 25న నదీం హుసేన్‌ను వరంగల్ కి వెళ్తున్నట్లు చెప్పి బస్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కాడు. ఇదే సమయంలో నదీం హుసేన్ యూనివర్సిటీలోని తన హాస్టల్‌కు వెళ్లకపోవడంతో కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని విద్యార్థి తండ్రి బాషాజాన్‌కు ఫోన్ ద్వారా చెప్పారు.
దీంతో గురువారం బాషాజాన్ అనంతపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే పట్టణంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని కూడా అదృశ్యమైంది. పట్టణంలోని అమ్మవారిశాల వీధికి చెందిన దూదేకుల షాకీరాభాను (21) స్థానిక జేసీ నాగిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. రోజూ లాగానే షాకీరాభాను గురువారం ఉదయం తన ఇంట్లో కళాశాలకు వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. అయితే కాలేజీకి అని వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో తండ్రి లాలెప్ప పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.