మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. కాలం కలిసి రాకుంటే తాడే పామై కాటు వేస్తుందని పెద్దలు అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఆర్టీవో ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ముక్కలు ముక్కలుగా పేలిపోయాడు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. కాలం కలిసి రాకుంటే తాడే పామై కాటు వేస్తుందని పెద్దలు అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఆర్టీవో ఆఫీస్ సమీపంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సతీష్ అనే వ్యక్తి ముక్కలు ముక్కలై మృతిచెందారు. పేలుడు శబ్ధం రావడంతో చుట్టుపక్కల జనాలు ఒక్కసారే భయాందోళనకు గురయ్యారు. అయితే మృతుడి భార్య గుండెలు పగిలేలా రోదించిన తీరు స్థానికుల హృదయాలను ద్రవింపం చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లాల గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన చాకలి సతీష్(34), నవ్య భార్యభర్తలు. అనంతపురం లోని కేకే పెయింట్స్ యజమాని ఇస్మాయిల్ కు చెందిన అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్, ఇంటి పనులు చేసుకుంటూ ఈ ఇద్దరు జీవననం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయ సమీపంలో గల పెయింట్స్ తయారీ పరిశ్రమను ఇస్మాయిల్ పదేళ్ల క్రితమే మూసేశారు. అయితే కెమికల్స్ డ్రమ్ములు అలాగే ఉన్నాయి. ముందు భాగంలో వుడ్ వర్క్ తయారు చేసే పరిశ్రమ నడుపుతున్నారు.
మూసేసిన పెయింట్ పరిశ్రమ షెడ్లను అద్దెకు ఇచ్చాడు. వారి కోసం షెడ్లను శుభ్రం చేయించి.. కెమికల్ డ్రమ్ములను ఇస్మాయిల్ బయట పెట్టించారు. కెమికల్‌ను కాలువలోకి పారబోసి.. డబ్బాలను అమ్ముకుని డబ్బు నువ్వే తీసుకో అని చాకలి సతీష్‌కు చెప్పాడు. ఎంతో కొంత డబ్బు వస్తుందన్న సతీష్ అన్నకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం షెడ్డు వద్దకు వచ్చి ఒక డ్రమ్ము మూత తీస్తుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి సతీష్ గాల్లోకి ఎగిరి శరీరం ఛిద్రమైంది. మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా ఆ ప్రాంతమంతా పడటంతో భయానక వాతావరణం నెలకొంది.
విషయం తెలిసిన మృతుడి భార్య సంఘటన స్థలానికి చేరుకుంది. భర్త శరీరం తునాతునకలైపోయి ఉండటం చూసి స్పృహ ఆమె తప్పి పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత కోలుకుని గుండెలు బాదుకుంటూ విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ ఘటనలో వారి కుటుంబం దిక్కులేనివారిగా మిగిలిపోయారు. తండ్రి కోసం సతీష్ కుమారులు ఎదురు చూస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరి.. ఇలా తరచూ కెమికల్ బ్లాస్టింగ్ ఘటనలు జరగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.