ఈ మద్య కాలంలో కొందరు యువత ఈజీ మనీ కోసం దేనికైనా సిద్ధ పడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్, ఇతర బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇక బెట్టింగ్ లకి బానిసలుగా మారి.. ఏకంగా అప్పుల పాలవుతున్నారు. అంతేకాక చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలానే తాజాగా ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా నిండు జీవితాన్ని కోల్పోయాడు.
ఈ మద్యకాలంలో కొందరు యువత ఈజీ మనీ కోసం దేనికైనా సిద్ధ పడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్, ఇతర బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇక బెట్టింగ్ లకి బానిసలుగా మారి.. ఏకంగా అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురై.. ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు బెట్టింగ్ లతో అప్పుల పాలయ్యాడు. అవి తీర్చే మార్గం తెలియక ఒత్తిడికి లోనై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబదించిన వివరాలు పూర్తిగా వెళ్తే..
అనకాపల్లి జిల్లా దిబ్బపాలె గ్రామంలో పెద్దకోట నర్సింగరావు, జయ దంపతులు. వీరికి మధుకుమార్ (20) అనే కుమారుడు ఉన్నాడు. అతడు ప్రస్తుతం అనకాపల్లి డిగ్రీ ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మధు కుమార్ తరచు క్రికెట్ బెట్టింగ్ చేసేవాడని తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ కోసం తన అదే గ్రామానికి చెందిన నర్సింగరావు దగ్గర అప్పు చేశాడు. బెట్టింగ్ లో ఆ డబ్బులను కోల్పోయాడు. కొన్నాళ్లుకు అప్పు తీర్చమని నర్సింగ రావు .. మధు కుమార్ ను అడిగాడు. అయితే తన దగ్గర డబ్బులు లేక అప్పులు చెల్లించే మార్గం లేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 23 వ తేదీ రాత్రి ఎవరు లేని సమయంలో ఎలుకల మందు తాగాడు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మధు కుమార్ మృతిచెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా బెట్టింగ్ లు పెడుతూ ప్రాణాలు కోల్పోతున్న యువతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.