ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది తీవ్ర గాయాలతో నరకవేదన అనుభవిస్తున్నారు. అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరేందరో కాలిన గాయాలతో తీవ్ర వేదన చెందుతున్నారు. కొన్ని అగ్నిప్రమాదాల కారణంగా మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. కొందరు చేసే చిన్న పొరపాటు మూగజీవాల పాలిట శాపంగా మారుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కొందరు చేసిన పని కారణంగా 86 గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి, బడప్ప, రాము అనే ముగ్గురు గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఈ ముగ్గురు తమ గొర్రె పిల్లలను ఓ పొలం సమీపంలో కంచె వేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో గడ్డికి నిప్పంటించారు. దీంతో ఆ మంటలు పెద్ద ఎత్తున సమీప ప్రాంతమంతా వ్యాపించాయి. ఇదే సమయంలో మంటలు వ్యాపించి కంచెలో ఉన్న గొర్రె పిల్లలన్నీ కాలి బూడిదయ్యాయి. 86 గొర్రెల పిల్లలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సుమారు రూ.3.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎవరో ఆకతాయిలు చేసిన పనికి 86 మూగ జీవాలు సజీవ దహనమయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆధారమైన గొర్రెలు కాలి బూడిదగా మారడంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమకు న్యాయం చేయలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలును కామెంట్స్ రూపంలో తెలియజేయండి.