రాష్ట్ర ప్రజలను వైరల్ జ్వరాలు కంగారు పెడుతున్నాయి. జ్వరం,దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను వైరల్ జ్వరాలు కంగారు పెడుతున్నాయి. ఏపీలోనూ జ్వరాలు అందరిని భయపెడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆస్పత్రుల్లో చేరికలు అంతగా లేకపోయినా.. జ్వరం లక్షణాలు ఎక్కువగా ఉంటుండంతో బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. కొవిడ్ లోనూ దాదాపు ఇవే లక్షణాలు ఉండటంతో బాధితులు మరింత హైరానా పడుతున్నారు. ఇన్ ఫుయోంజా ‘ఎ’ వైరస్ లో హెచ్3ఎన్2 అనే ఉపరకం వైరస్ వల్ల ఈ జ్వరం వస్తోంది. సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజులు ఉంటోంది. గత కొన్ని రోజుల్లో ఏపీలో జ్వరాల కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే భయపడాల్సిన పనిలేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. అంతేకాక ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్ కేసు పెరుగుతున్నాయి. మాములు జ్వరమో, వైరల్ ఫీవరో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరాలు, విపరీతమైన దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలతో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో ఈనెల 5 నుంచి 7వ తేదీల మధ్య 20వేల జ్వరాల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో రోగులు బాధపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా ‘ఎ’ వైరస్ లోని H3N2 సబ్ వేరియంట్ వల్లే వైరల్ జ్వరాలు అధికమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల కేసులు అనంతపురం జిల్లాలో 1200, చిత్తూరు, ఏలూరు, కృష్ణా, వైయస్ఆర్ కడప, కోనసీమ జిల్లాలో వెయ్యి చొప్పున ఉన్నాయి. ఏడు రోజుల కంటే ఎక్కవుగా వైరల్ ఫివర్ తో బాధపడిన కేసులు అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు ఏలూరు జిల్లాల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ఓపీలో చికిత్స పొందినవారు మూడువేల లోపే ఉన్నారు. ఎడతెరిపి లేకుండా దగ్గు, జ్వరం, శ్వాస, పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలూ కొందరిలో కనిపిస్తున్నాయి. బాధితుల్లో కొందరు వైద్యులను సంప్రదించకుండా మెడికల్ షాపులకు వెళ్లి సిబ్బంది ఇచ్చిన మందులను వాడుతున్నారు.
మరికొందరు సొంత వైద్యం చేసుకుంటున్నారని తెలిస్తోంది. వైరల్ ఫీవర్స్ లక్షణాలు, తీసుకువలసిన జాగ్రత్తల గురించి వైద్యులు పలు సూచనలు చేశారు. యాంటీ బయాటిక్స్ వాడొద్దని, ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలని, నోరు, ముక్కును పదేపదే తాకొద్దని, తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీళ్లు తాగాలి, నీరసించకుండా ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. మరి.. ఇలా వైరల్ ఫివర్ విజృభించడంకి గల కారణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.