కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలను తీర్చే శ్రీ వారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక సెలవులు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ఉన్న సమయంలో భక్తుల సంఖ్యగా భారీగా పెరుగుతుంది. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలను తీర్చే శ్రీ వారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక సెలవులు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ఉన్న సమయంలో భక్తుల సంఖ్యగా భారీగా పెరుగుతుంది. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి సమాచారం గురించి తెలుసుకునేందుకు భక్తులు ఎంతగానో ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా దర్శన సమయం గురించి, ఇతర అర్జిత సేవలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
ఇక తిరుమల దర్శన విషయానికి వస్తే.. వరుసగా మూడు రోజులు సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే సర్వ దర్శనం కోసం టోకెన్లు లేకుండా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. ఇక శ్రీవారి దర్శన సమయం గురించి వచ్చి.. సుమారు 30 గంటలు పడుతుందని తితిదే వర్గాల సమాచారం. నేటి సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లోకి రద్దు చేసి.. తిరిగి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ పరిస్థితిని తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. క్యూలైన్లలో, కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.