ప్రతి ఒక్కరి కొన్ని రకాల ధృవీకరణ పత్రాలు జీవితంలో అనేక సందర్భాల్లో తప్పనిసరి అవుతుంటాయి. అలాంటి వాటిల్లో జనన ధృవీకరణ పత్రం ఒకటి. ఈ పత్రం ఎంత విలువైనదో అందరికి తెలుసు. అయితే కొందరు బర్త్ సర్టీఫికెట్ తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. రేపు, ఎల్లుండి అంటూ రోజులు గడిపేస్తారే తప్ప తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాలు తీసుకోరు. అలాంటి వారు ఇబ్బందుల్లో ఉన్నట్లే. అలాంటి వారికి అవసరమైనప్పుడు జనన ధృవీకరణ పత్రం పొందాలనుకుంటే చాలా ప్రయాస పడక తప్పదు. బిడ్డ పుట్టిన 21 రోజుల్లోపు అయితే మీ ఊళ్లలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం కేవలం మీరు చేయాల్సింది దరఖాస్తు చేసుకోవడం మాత్రమే. ఇలా కూడా చేయని వారికి ఇబ్బందులు తప్పు. మరీ ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలు పుట్టిన 21 రోజుల్లోపు స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్ ద్వారా బర్త సర్టిఫికేట్ పొందవచ్చు. ఒకవేళ 21 రోజుల గడువు దాటిన తరువాత.. బిడ్డ పుట్టిన 30 రోజుల వరకు అయినా కూడా అదే గ్రామా పంచాయతీ కార్యాలయంలో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. అయితే పంచాయతీ ఉండే ప్రాంతాన్ని బట్టి రూ.20 నుంచి రూ.100 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలానే చిన్నారి పుట్టిన 30 రోజులు దాటిన తరువాత జనన ధృవీకరణ పత్రం పొందాలంటే కాస్తా శ్రమించాల్సి ఉంటుంది. 30రోజుల తరువాత కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ లోనే జనన ధృవీకరణ పత్రం ఇస్తారు. కానీ అక్కడి అధికారులు బర్త్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఎమ్మార్వో అవసరం. అనుమతితో పాటు అదనపు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇక బిడ్డ పుట్టిన ఏడాది తర్వాత బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మరిన్ని సమస్యలు తప్పవు. అలాంటి వారికి గ్రామ పంచాయతీ కార్యాయంలో ఎగ్జిక్యూటీవ్ లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు జనన ధృవీకరణ పత్రాలను జారీ చేయాల్సి ఉంటుంది. ఆ అనుమతులు జారీ చేయాలంటే ఆర్టీవో ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. కాబట్టి ఇంతేకాక మరెన్నో ఇతర ఇబ్బందులు కూడా రావచ్చు. కాబట్టి పిల్లలు జన్మించిన 21 రోజుల్లోపు జనన ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.