సాధారణంగా కొందరు మందుబాబులు మద్యం సేవించి రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తుంటారు. అప్పటి వరకు మంచిగా ఉన్నవారు.. మందు తాగితే వారిలోని అపరిచితులు బయటకు వస్తుంటారు. దాంతో రోడ్లపై వీరంగం సృష్టిస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తుల వల్ల స్థానికులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఓ తాగుబోతు పీకల దాకా తాగి అతి ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి వైర్లతో ఆటలాడాడు.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
కర్నూల్ జిల్లా లో ఖాసీం అనే యువకుడు పీకలదాకా తాగి అక్కడే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దిమ్మ ఎక్కి వైర్లతో ఆట ఆడుకోవడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్నవారు ఎంత చెప్పినా మత్తులో మునిగితేలుతున్న ఖాసీం ఏదీ పట్టనట్టుగా ప్రవర్తించాడు. స్థానికులు వెంటనే కరెంట్ అధికారులకు ఫోన్ చేయడంతో కరెంట్ ఆపివేశారు.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు గ్రామస్థులు.
ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న ఖాసీం ని అతని బంధువులు నానా తిప్పలు పడి ఎలాగో అలా ఇంటికి తీసుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. తాగిన మైకంలో ఇలాంటి ప్రమాదకరమైన పనులుచేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటే కుటుంబ పరిస్థితి ఏంటని స్థానికులు ఈ సంఘటనపై చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లబోయి.. పక్కింట్లోకి వెళ్లాడు!