చాలా మందికి జీవితంలో ఏదో ఒకటి సాధించింది సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరి లో ఆ కోరిక బలంగా ఉండి.. దానికి తగిన కృషి చేస్తారు. ఈక్రమంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అంత బాగుంది అనుకున్న సమయంలో విధి ఆడే నాటకంలో బలవుతుంటారు. తాజాగా ఓ యువతి అలానే తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయింది. కష్టపడి చదివి ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించింది. ఇక కుటుంబానికి అండగా నిలబడిన సమయంలో విధి వక్రీకరించి.. ఆ యువతి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే..
కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో గ్రామానికి చెందిన విజయకుమారి(21) పట్టుదలతో చదివి ఎంఎల్ హెచ్ పీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆర్థికంగా ఇబ్బందులున్న తన కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. ఈక్రమంలో ఆరోగ్య శాఖలో ఏఎన్ ఎం ఉద్యోగం సాధించింది. విజయకుమారికి ఉద్యోగం రావడంతో ఆమె కుటుంబం ఆనందపడింది. పి. గన్నవరం మండలం ఏనుగుపల్లి పీహెచ్ సీలో విధులలో చేరింది. సరిగ్గా విధులో చేరి పది రోజుల కూడా కాలేదు. ఇటీవల ఆమెకు స్వల్పంగా అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను రాజమహేంద్రవరం కి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: పెళ్లి అయిన 2 నెలలకే దారుణం! భర్త ఆఫీస్ నుండి రాగానే..!
అక్కడ చికిత్స పొందుతూ విజయకుమారి మృతి చెందింది. ఆమె మృతి పట్ల గ్రామస్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఆమె తండ్రిని పులువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. జీవితంలో ఎంతో సాధించాల్సి ఆమె విధి ఆడిన నాటకంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి