భర్త కాలం చేశారు.. వృద్దాప్యంలో అందరూ ఉండీ ఆదరణ కరువైన 82 ఏళ్ల పెద్దావిడ నడవలేని స్థితిలో కన్న కొడుకు నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంది. కొడుకు నుంచి కాపాడాలంటూ నడవలేని స్థితిలో నడుచుకుంటూ అధికారుల వద్దకు వెళ్లింది.
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. నవమోసాలు మోసి బిడ్డలకు జన్మనిస్తుంది. పిల్లలు వచ్చి రానీ మాటలతో ‘అమ్మ’ అని పిలుస్తుంటే ఎంతో సంతోష పడుతుంది. తాను ఎన్ని కష్టాలు పడుతున్నా బిడ్డల సుఖాల కోసం పరితపిస్తుంటారు. తన సంతోషాలను వదులుకుని బిడ్డల కోసం అమ్మ ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఇలా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేసి.. ఓ ఇంటి వారిని చేస్తుంది. అయితే అలా తన జీవితానికి ఆధారమైన తల్లిని కొందరు కొడుకులు హింసిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ఆస్తి కోసం అమ్మను అత్యంతం దారుణం హతమారుస్తున్నారు. మరికొందరు ఆస్తి తమ పేరు రాయమని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. అలా వేధిస్తున్న తన కొడుకు నుంచి కాపాడమని ఓ 82 ఏళ్ల వృద్ధురాలు అధికారులను వేడుకుంది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం చినరావూరు గ్రామంలో మాణిక్యమ్మ భర్తతో కలిసి కొన్నేళ్లు నివాసం ఉంటుంది. అయితే ఆమె భర్త 7 నెలల క్రితం వృద్ధాప్యంతో చనిపోయారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిని చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. మాణిక్యమ్మ దంపతులు ఇద్దరు పని చేస్తూ పిల్లల అభివృద్ధికి కృషి చేశారు. ఇటీవల ఆస్తి విషయంలో వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మాణిక్యమ్మ గతంలో పెద్ద కుమారుడి కూతురికి ఆస్తి రాసిచ్చినట్లు సమాచారం. అయితే ఆమెకు రాసిచ్చిన ఆస్తిని తనకు స్వాధీనం చేయాలని మూడో కుమారుడు తనను హింసిస్తున్నాడని ఆ పెద్దావిడ స్పందన కార్యక్రమంలో అధికారులకు విజ్ఞప్తి చేసింది. అలానే తన కొడుకు నుంచి రక్షణ కల్పించి, జీవనాధారానికి పింఛనను మంజూరు చేయాలని అధికారులను వేడుకుంది. మరి.. ఇలా ఆస్తి కోసం తల్లిదండ్రులను హింసిస్తున్న బిడ్డలపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్లో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.