విహార యాత్రలు చేయాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అందుకే తరచూ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు, ఇతర దర్శనీయ స్థలాలకు వెళ్తుంటారు. అలా అడవుల్లో, జలపాతాల వద్దకు వెళ్లి సంతోషంగా గడుపుతుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సరదాలు కుటుంబాల్లో విషాదాలను నింపుతాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అలాంటి ఓ సరదా విషాదాన్ని నింపింది.
విహార యాత్రలు చేయాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అందుకే తరచూ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు, ఇతర దర్శనీయ స్థలాలకు వెళ్తుంటారు. అలా అడవుల్లో, జలపాతాల వద్దకు వెళ్లి సంతోషంగా గడుపుతుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సరదాలు కుటుంబాల్లో విషాదాలను నింపుతాయి. తాజాగా కోనేరు వద్ద సరదగా గడిపేందుకు వెళ్లిని ముగ్గురు బాలికలు.. మృత్యు ఒడికి చేరారు. ఈ ముగ్గురు యువతుల మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి గ్రామానికి చెందిన కదిరప్ప అనే వ్యక్తి కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో ఆయన కోరుకున్న కోరికలు తీరడంతో గ్రామ సమీపంలోని కాటేరమ్మకు దేవర చేయాలని అనుకున్నాడు. అమ్మవారికి తాను చేస్తున్న దేవరకు తమిళనాడు రాష్ట్రంలోని అరవట్లలో ఉండే తన బంధువులను ఆహ్వానించాడు. కదిరప్ప బంధువులు కూడా ఎంతో సంతోషంగా దేవర కోసం కదిరప్ప ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి మంగళవారం అందరూ కలిసి కాళభైరేశ్వరస్వామి ఆలయం వద్ద వెళ్లారు.
అక్కడ అందరు అమ్మవారికి పూజలు చేస్తుండగా.. ఆయా కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలు కొండ కింద కోనేటి వద్ద సరదగా గడిపేందుకు వెళ్లారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కోనేట్లో దిగి స్నానాలు చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో కదిరప్ప కుమార్తె గౌతమి(14), అరవట్లకు చెందిన సుబ్రమణ్యం కుమార్తె భవ్య(17), మరో బంధువు రమణ కుమార్తె మౌనిక(13) ఒకరి వెంట ఒకరు నీటిలోకి దిగారు. అక్కడి నుంచి నీటిలో పడిపోయి.. మృత్యు ఒడికి చేరారు. ఎన్నో ఏళ్లుగా కోనేటి కింది భాగంలో పాచి పట్టి.. అది కాళ్లకు తగులుకుని బిడ్డలను పైకి రాకుండా చేసిందని స్థానికులు అంటున్నారు.
కోనేటి వద్ద ఆలయ నిర్వాహకులు పర్యవేక్షణ లేకపోవడం, ఈ ఆలయం అడవిలో ఉండడంతో వారు ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోయారని స్థానికులు అంటున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డలు దూరమవ్వడంతో మృతుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. వారి ఆక్రోదన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.