కొందరు చిన్న చిన్న వాటి కోసం పెద్ద రిస్క్ చేస్తుంటారు. చూసే వారికి అది సిల్లీగా ఉన్నా.. చేసే వారికి మాత్రం అదే జీవనాధారం. తాజాగా మంగళగిరి ప్రాంతంలో ఓ మహిళ.. ప్రాణాలను పణంగా పెట్టి చెట్టు చిటారి కొమ్మకు వెళ్లి చింత చిగురు కోసింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాల్లో చింతచిగురుకు ఉన్న క్రేజ్ అంతాఇంత కాదు. ప్రధానంగా ఏప్రిల్ వచ్చిందంటే చాలు చింత చిగురుకోసం అందరు ఎదురుచూస్తుంటారు. గతంలో పల్లెటూర్లలో నడుచుకుంటూ వెళ్లి చింతచిగురు కోసుకునేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం చింతచిగురు కమర్షియల్ గా మారింది. దీని కోసుకొచ్చి టౌన్, సిటీల్లో అమ్ముతుంటారు.అదే కొందరికి జీవనోపాధి.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని బాపూజీనగర్ సమీపంలో చింత చెట్లు ఎక్కువ ఉండడంతో కొంతమంది మహిళలు ప్రాణాలకు తెగించి మరి చిగురు కోసి అమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. అలా ప్రతి పల్లెల్లో మహిళలు తెల్లవారంగానే చింతచిగురు కోసం వేట సాగిస్తుంటారు. ఈ చింతచిగురు కోసం మహిళలు అనేక పోరాటలు చేస్తుంటారు. ఎంతలా అంటే చిగురు కోసం చింతచెట్టు చిటారి కొమ్మకు సైతం వెళ్తుంటారు.ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతుంటారు. పలు సందర్భాల్లో అలా చెట్టు మీద నుంచి కిందపడి గాయలపాలైన వారు ఉన్నారు. అలా అనేక ఘటనలు జరుగుతున్న జీవనోపాధి కోసం వారికి ఈ సాహసాలు తప్పడం లేదు.
మంగళగిరి మండలంలోని బాపూజీ నగర్ సమీపంలో ఓ మహిళ చెట్టు చిటారి కొమ్మకు వెళ్లి మరి చింత చిగురు కోస్తుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి .. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామాన్యుల జీవన పోరాటానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీవనోపాధి కోసం పనిచేయడం మంచిదే కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునేలా.. ఇలా చేయడం మంచిది కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరి.. జీవనోపాధి కోసం కొందరు చేస్తున్న ఇలాంటి సాహసలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.