ఈ భూమి మీద వెల కట్టలేనిది అమ్మనాన్నల ప్రేమ. ఎందుకంటే.. వారు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. అలాంటి బిడ్డలు పొరపాటున కనిపించకుంటే.. తల్లిదండ్రులు విలవిల్లాడి పోతారు. రాడు అనుకున్న బిడ్డ తిరిగి వస్తే.. ఆ తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిది
ఈ భూమి మీద వెల కట్టలేనిది అమ్మనాన్నల ప్రేమ. ఎందుకంటే.. వారు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. తమ సుఖ సంతోషాలను వదులుకుని పిల్లల అవసరాలను తీరుస్తుంటారు. వారు పస్తులు ఉంటూ బిడ్డల ఆకలి తీరుస్తుంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చిన తల్లిదండ్రులు విలవిల్లాడిపోతుంటారు. అలా ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తమ బిడ్డ కనిపించకపోతే ఆ పేగుబంధాలు అల్లాడిపోతుంటాయి. అలా అదృశ్యమైన బిడ్డలు చాలా నెలల తరువాత తిరిగి వస్తే.. ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ దంపతుల మూడేళ్ల కుమారుడు తప్పి.. 20 నెలల తరువాత తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా కులువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మి భార్యాభర్తలు. ఈ దంపతులు మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమారుడు మూడేళ్ల సంజు 2021 జూన్ 29వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బుజ్జయ్య ఎప్పటిలాగానే మేకలు తోలుకుని అడవికి వెళ్లగా.. ఆయన రెండో కుమారుడు సంజు కూడా తండ్రిని అనుసరిస్తూ వెనకాలే వెళ్లాడు. అయితే తన వెనుక కుమారుడు వస్తున్న విషయాన్ని బుజ్జయ్య గమనించలేదు. సాయంత్రం ఇంటికీ వచ్చిన బుజ్జయ్య దంపతులకు సంజు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామాల్లో తీవ్రంగా గాలించినా ఆ బాలుడి ఆచూకి లభించలేదు. ఆ సమయంలోనే పోలీసులకు కూడా బుజ్జయ్య దంపతులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం నెలరోజుల పాటు బాలుడి కోసం అడవిని జల్లెడ పట్టినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో దాదాపు 20 నెలల తరువాత.. సోమవారం అతడి ఆచూకి లభించింది. కొన్ని రోజుల క్రితం రాజంపేటకు చెందిన ఓ మహిళ కలువాయి మండలం తోపుగుంటలో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె వస్తూ ఓ బాలుడిని తన వెంట తీసుకొచ్చింది. ఈ బాబు ఎవరని ఆమె బంధువులు అడగ్గా.. ఉయ్యాలపల్లి వద్ద తన మరిదికి దొరికాడని ఆమె చెప్పి..తిరిగి తన ఊరికి వెళ్లింది. ఈక్రమంలో ఆదివారం ఆ సమాచారం బాధిత తల్లిదండ్రులకు చేరింది. వారు ఆ బిడ్డ తమ బిడ్డ కావొచ్చెమో అనే ఆశతో రాజంపేటకు వెళ్లారు. ఆ బాలుడు తమ బిడ్డేనని గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. తమ బిడ్డను ఎవరైనా తీసుకెళ్లి ఉంటారనే అనుమానంతో ఉండేదని, అదే నిజమైందని సంతోషంతో ఆ బాలుడు తల్లిదండ్రులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.