పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే యువతీయువకులు తమ పెళ్లిన ఘనంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. అలానే ఓ యువకుడు కూడా తన పెళ్లి గురించి ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. అందమైన అమ్మాయితో ఆ యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లైన మూడు రోజులకు ఆ యువకుడికి నవ వధువుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే యువతీయువకులు తమ పెళ్లిన ఘనంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. అలానే ఓ యువకుడు కూడా తన పెళ్లి గురించి ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. అనుకున్నట్లుగానే చక్కనైన యువతితో ఆ యువకుడికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన మూడు రోజులకు ఆ యువకుడికి నవ వధువుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన ప్రియుడితో కలిసి నవ వధువు పరారైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వరుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు, ప్రశాంత్ కుమార్ అన్నదమ్ములు. వీరికి తండ్రి చాలా ఏళ్లక్రితం మరణించారు. వారి తల్లి అంజనమ్మ బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరు అనంతపురంలో వెళ్లి.. పట్టణంలోని కురుగుంట వైఎస్సార్ కాలనీ నివాసముంటున్నారు. తిమ్మరాజు ఓ ప్రైవేటు కంపెనీలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అలానే ప్రశాంత్ కుమార్ ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదివి..ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ఇక సాఫ్ట్ వేర్ అయిన తిమ్మరాజుకు మార్చి9న ఓ యువతితో వివాహం జరిగింది. అయితే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న ఆ యువతికి.. ఆమె తల్లిదండ్రులు తిమ్మరాజుతో వివాహం జరిపించారు. తిమ్మరాజుతో పెళ్లి ఇష్టంలోని ఆ యువతి .. వివాహం జరిగిన మూడో రోజే తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. నవ వధువు అదృశ్యమయ్యే సరికి తిమ్మరాజు ఆందోళనకు గురయ్యాడు. అదే విషయాన్ని బంధువులు చెప్పడంతో అందరూ కలిసి పలుచోట్ల గాలించినా ఆ యువతి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చివరకు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే మరో వ్యక్తే వెళ్లిపోవడంతో తిమ్మరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆమె అదృశ్యమైన సరిగ్గా నెలకు అంటే.. ఈ నెల 9న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు ప్రశాంత్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికిన ఆచూకి లభ్యం కాలేదు. చివరకు సోమవారం అనంతపురం రూరల్ పోలీసులకు ప్రశాంత్ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.