ఇరువురి పెద్దల నిర్ణయం మేరకు వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. అతను కోరినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. భార్యతో పాటు ఏడడుగులు నడిచి తోడుగా ఉంటానంటూ బంధువుల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఇక పెళ్లై కొన్ని రోజులు గడుస్తూ ఉంది. వివాహం జరిగిన కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య ఎంతో సంతోషంగా సాగింది. అయితే ఈ క్రమంలోనే కట్టుకున్న భార్యను కాదని భర్త పరాయి మహిళపై మనసు పడి ఏకంగా మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఈ తన భర్తకు ఇంతకముందే పెళ్లైన విషయం తెలుసుకున్న రెండో భార్య ఏం చేసింది? భర్త చేసుకున్న రెండో పెళ్లి సంగతి తెలిసి మొదటి భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరు గ్రామం. కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ అనే వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహం అయింది. ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తూ ఉండే వారు. పనులు ఉన్నాయంటూ కొంత కాలంగా భర్త తరచు బయటకు వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ల పాటు భర్త భార్యను నమ్మిస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే గతంలో వేణుగోపాల్ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన పేరును నమోదు చేసుకోవడంతో అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న రూపతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కొన్నాళ్ల పాటు సాగుతూ వచ్చింది. తనకు ఇదివరకే పెళ్లైన విషయం మాత్రం వేణుగోపాల్ రూపకి తెలియకుండా ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడే వీరిద్దరూ కొంత కాలం పాటు కాపురాన్ని పెట్టారు. అయితే భర్త వేణుగోపాల్ ప్రవర్తనలో మార్పును గమనించిన రూప.. వాళ్ల సొంతూరికి వెళ్దామంటూ చెప్పింది.
దీంతో వేణుగోపాల్ నోట్లో నీళ్లు నమలడంతో పట్టుబట్టిన భార్య వేణుగోపాల్ ఇంటికి తీసుకెళ్లింది. దీంతో వేణుగోపాల్ ఇంటికి వెళ్లగానే రూపకు వారింట్లో మరో మహిళ కనిపించింది. దీంతో అనుమానమొచ్చిన రూప.. భర్తను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వేణుగోపాల్ మొదటి భార్య, రెండో భార్య ఒకరినొకరు జుట్లు పట్టుకుని నడి రోడ్డు మీదే కొట్టుకున్నారు. నాకు న్యాయం చేయాలంటూ వేణుగోపాల్ ఇంటి ముందు రూప ధర్నాకు దిగింది. దీంతో మొదటి భార్య బంధువులు వచ్చి రూపని చితకబాదారు. ఈ పంచాయితీ పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.