ఓ వ్యక్తి .. 25 ఏళ్ల పోరాడి.. తన ప్రభుత్వ ఉద్యోగం అనే కలను నేరవేర్చుకున్నాడు. అయితే మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవి విరమణ చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరు కల కంటారు. ఆ కలను నిజం చేసుకునేందుకు రేయింబవళ్ల కష్టపడి చదువుతుంటారు. ఇలా ఎందరో ఏళ్ల తరబడి తమ కలను నిరవేర్చుకునేందుకు కృషి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు విజయం సాధించి.. తమ కలను సాకారం చేసుకుంటారు. అలానే ఓ వ్యక్తి కూడా తన 25 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగం అనే కలను నేరవేర్చుకున్నాడు. అయితే మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవి విరమణ చేయనున్నారు. మరి.. 25 ఏళ్ల కలేంటి.. 18 రోజులకే పదవి విరమణ ఏంటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలే డీఎస్సీ-1998 అభ్యుర్ధులకు ఏపీ ప్రభుత్వం ఆయా పాఠశాల్లో ఒప్పంద ఉపాధ్యాయులగా ఎంపిక చేసింది. అలానే ఎంపికైన వారిలో చాలా మంది ఇప్పటికే వివిధ పాఠశాలలకు వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. అలా డీఎస్సీ -1998 ఎంపికైన వారిలో నంద్యాల జిల్లా డోన్ కు చెందిన వివేకశాస్త్రి కూడా ఉన్నారు. ఆయన దేవన కొండ మండలంలోని కె. వెంకటాపురం ప్రాథమిక పాఠశాలోల పోస్టింగ్ పడింది. ఇంతకాలం ఆయన ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
తాజాగా ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఈ క్రమంలో ఇటీవలే దేవనకొండ మండల విద్యాధికారిని వివేకశాస్త్రి కలిశారు. అనంతరం బయటకు వచ్చి మాట్లాడుతూ..”నేను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ-1998 లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. జూన్ 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్నా. పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. నేను కేవలం 18 రోజులు మాత్రమే విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డు కావాలనేది నా కోరిక.
అందుకే కేవలం 18 రోజులకే పదవి విరమణ చేస్తానని తెలిసి కూడ కొలువులో చేరాను” అని ఆయన అన్నారు. అలానే కె. వెంకటాపురంలో గ్రామంలో 123 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారు. మరో టీచర్ వస్తున్నారని తెలియాగనే ఆ పాఠశాల హెచ్ఎమ్ రంగస్వామి సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొత్తగా వచ్చే ఉపాధ్యాయుడు 18 రోజులకే పదవీ విరమణ పొందుతున్నారని తెలియగానే మళ్లీ నిరుత్సాహపడిపోయారు. మరి… 25 ఏళ్ల కల.. కేవలం 18 రోజులుగానే ఉండిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.