ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటుంది. షార్ట్ సర్యూట్, రసాయనాల నిల్వ వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ లోని స్వప్న కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు యువత ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటుంది. షార్ట్ సర్యూట్, రసాయనాల నిల్వ వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ లోని స్వప్న కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు యువత ప్రాణాలు కోల్పోయారు. అలానే సికింద్రాబాద్ లోనే మరో ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. తాజాగా కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పామాయిల్ తోటలో ఉన్న కెమికల్ డబ్బాల వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తి సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పామాయిల్ తోటలో ఉన్న రసాయన డబ్బాలకు మంటలు అంటుకుని ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ డబ్బాల నుంచి పెద్ద ఎత్తున మండలు ఎగసిపడుతున్నాయి. పీపాలు శుభ్రంగా చేస్తుండగా ఒకదానికి మరొకటి అంటుకుని మంటలు వచ్చాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అలానే స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఎంతసేపటి మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. రసాయన పీపాలు ఒక్కొక్కటిగా కాల్చి క్లీనింగ్ చేసే స్థలంలో అన్నీటికి ఒక్కేసారి నిప్పులు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ డబ్బాల నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పని చేసేవారు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఆ తరువాత క్షణాల్లోనే ఆ డబ్బాలు మొత్తం అగ్నికి ఆహుతై.. భారీ ఎత్తున పొగ ఏర్పడింది. పచ్చని చెట్ల మధ్యలో నల్లటి పొగలు కమ్ముకుని భయానక వాతావరణం కనిపించింది.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఇటీవలే హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి..ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కెమికల్స్ నిల్వఉంచిన డబ్బాలు పేలడంతో ఆ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలా తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరప్రాయంగా గడుపుతున్నారు. మరి.. ఇలా వరుస అగ్నిప్రమాదాల జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.