ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం మరువక ముందే మరికొన్ని అగ్నిప్రమాదాలు జరిగాయి. తాజాగా విశాఖపట్నంలో ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవి కాలం రాకముందే ఇలా తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు కాలిబుడిదై పోతున్నారు. మరేందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా అగ్నిప్రమాదాల కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. అయితే కరెంట్ షార్ట్క్యూట్ వంటి కారణలతో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఆకతాయిల కారణంగా కూడా కొన్ని అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొందరు ఆకతాయిలు బస్సులు, దుకాణాలకు నిప్పు అంటించి.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ బస్సు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన ఆకతాయిల చర్యగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నంలో శ్రీకాంత్ నగర్ లో బుజ్జి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు ఆరునెలల క్రితం 14 సీట్ల సామర్థ్యం ఉండే ఓ మినీ బస్సును కొనుగోలు చేశాడు. అయితే అధికారుల నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉండటంతో ఆ బస్సును రోడ్డుపై తిప్పడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నగర్ లోనే ఓ ఖాళీ స్థలం ఆ మినీ బస్సును నిలిపి ఉంచారు. ఈ క్రమంలోనే ఆ బస్సులోకి చేరి ఆకతాయిలు ప్రతిరోజు మద్యం సేవించేవారని, వారిని బుజ్జితో పాటు తాము హెచ్చరించేవారమని స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా బస్సులోంచి మంటలు వచ్చాయి. చూస్తు ఉండగానే తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి.
వెంటనే గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. మంటలు చేలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఆ మంటలు ఇళ్ల వైపు వస్తాయని స్థానికులు భయందోళనకు గురయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొన్న బస్సు బుడిదగా మారేసరికి బాధితుడు తీవ్ర వేదన చెందాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.