నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం అనేవి కొరవడినాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడుతుంటారు. అలానే చిన్న అపజయం ఎదరవగానే నిరుత్సాహపడి.. తమను తాము తక్కువ చేసుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురై.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఏంబీఏ చదువుతున్న యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది.
నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం అనేవి కొరవడినాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడుతుంటారు. అలానే చిన్న అపజయం ఎదరవగానే నిరుత్సాహపడి.. తమను తాము తక్కువ చేసుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురై.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిలైన, తల్లిదండ్రులు అరచిన, స్నేహితులు హేళన చేసిన.. ఇలా సమాజంలో ఎదురయ్యే వాటికి బాధపడుతూ క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, నారయణమ్మ దంపతులు. వీరి ప్రకాశం జిల్లాకు చెందిన వారు కాగా సుమారు 30 ఏళ్లుగా విజయవాడలో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రతాప్ రెడ్డి, ప్రత్యూష(23) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు కోల్ కతాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అలానే ప్రత్యూష విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఏంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వెంకటేశ్వరరెడ్డి వన్‌టౌన్‌లోని పాత పట్టాల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.
నారాయణమ్మ కుంచనపల్లిలో పొలం పనులకు వెళుతుంటారు. వెంకటేశ్వర్ల దంపతులు ఉదయాన్నే వారి పనులకు, కుమార్తె ప్రత్యూష కాలేజీకి వెళుతుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెంకటేశ్వరెడ్డి తన తల్లిని దింపేందుకు ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని రాజీవ్‌పురానికి వెళ్లాడు. దీంతో ఇంట్లో తల్లీకూతుళ్లిద్దరూ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నారాయణమ్మ పొలం పనికి వెళ్లగా ప్రత్యూష మాత్రమే ఇంట్లో ఉంది. సాయంత్రం సమయంలో వెంకటేశ్వరరెడ్డి కుమార్తె కి చాలా సార్లు ఫోన్ చేశాడు.
ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో పొరుగింటి వారికి ఫోన్ చేశారు. వారు, వచ్చి తలుపు తెరిచి చూడగా ప్రత్యూష ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో వారు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.