ఏ తండ్రైనా తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ, ఆమె అవసరాలు తీరుస్తుంటాడు. బాగా చదివించి.. గొప్ప సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలని కోరుకుంటాడు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పరాయి వారితో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటే ఏ తండ్రి భరించలేడు. సమాజంలో పరువు ప్రతిష్ట ఆలోచించే వారు అస్సలు సంహిచలేరు. తాజాగా అలా ఓ తండ్రి తన కూతురు వేరే యువకుడి బైక్ పై వెళ్లడం చూసి భరించలేక పోయాడు. వారిని అడ్డగించి కోపంతో దారుణానికి పాల్పడాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని మల్లమ్మ గుడి వీధిలో ఓ యువతిని యువకుడు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్తున్న సమయంలో వారిద్దరు ఆ అమ్మాయి తండ్రి కంట పడ్డారు. కూతురిని పరాయి యువకుడితో చూసిన ఆ తండ్రి.. వారిద్దరిని అడ్డగించి గట్టిగా మందలించాడు. అంతటితో ఆగకుండా అమ్మాయి తండ్రి కోపంతో ద్విచక్ర వాహనాన్ని అక్కడిక్కడే తగలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. తన కూతురు అలా మరొక యువకుడి బైక్ పై వెళ్లడం ఏ తండ్రైనా సంహిచలేడు కదా అంటూ కొందరు స్థానికులు అంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ని స్థానిక మల్లమ్మ గుడి వీధిలో ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన తండ్రి… pic.twitter.com/5eXHR5pgHB
— Rajasekhar (@Rajasek61450452) February 26, 2022
— Rajasekhar (@Rajasek61450452) February 26, 2022
— Rajasekhar (@Rajasek61450452) February 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.