కొందరు అక్రమం మార్గంలో డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం వంటి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పట్టపగలే భారీ చోరీ జరిగింది.
కొందరు అక్రమం మార్గంలో డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం వంటి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. అయితే ఎక్కువగా దొంగతనాలను రాత్రివేళ్లలో చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో దొంగలు తమ పంథాను మార్చుకున్నారు. రాత్రులు కాదు పట్టపగేలే చేస్తామన్నట్లు చోరీలకు పాల్పడుతున్నారు. అలా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పట్టపగలే ఇళ్లల్లోకి దూరి విలువైన వస్తువులను చోరీ చేశారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డి.. భారీగా నగదను చోరీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చెముడుగుంటలో కాకి రమేష్, కవిత నివాసం ఉంటున్నారు. వారి ఇళ్లు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఉండే విద్యుత్తు కాలనీలో ఉంది. గురువారం ఉదయం రమేశ్ నెల్లూరు వెళ్లగా.. కవిత శుభకార్యం ఉండటంతో ముత్తుకూరులోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇక మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి రమేశ్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి వెనుకవైపు తలుపు తెరిచి ఉండటం గమనించాడు. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెనుక వైపు తలుపు, తాళం ధ్వంసం చేసి.. లోపలికి దూరి బీరువాలో ఉన్న బంగారంతో పాటు రూ.1.5 లక్షల నగదు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.
బాధితుల సమాచారంతో వెంకటాచలం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. ఇది పక్క ప్రణాళికతో చేసినట్లు అనుమానిస్తున్నారు. బీరువాలో బంగారంతో పాటు వెండి వస్తువులు ఉన్నాయి. అయితే నిందితులు వెండి వస్తువులను అక్కడే వదిలి బంగారం, నగదు మాత్రమే తీసుకెళ్లారు. పక్కనే ఇళ్లలో మనుషులు ఉన్న చోరీ చేయడానికి ధైర్యం చేశారంటే.. స్థానిక పరిస్థితులు తెలిసిన వ్యక్తే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారికి కూత వేటు దూరంలో చోరీ జరగడంతో స్థానికులు భాయందోళనకు గురవుతున్నారు.