ఇటీవల కాలంలో వివాహేతర సంబంధం కారణంగా జరిగే ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. పరాయి వారి మోజులో పడి జీవిత భాగస్వామినే మోసం చేస్తున్నారు. ఇలా భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే తమ వివాహేతర సంబంధాన్ని అడ్డు ఉన్నారని భాగస్వామిని, కన్నపిల్లలను హత్య చేయడానికి వెనుకాడటం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తాజాగా ఓ మహిళ బలైంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధం కారణంగా జరిగే ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. పరాయి వారి మోజులో పడి జీవిత భాగస్వామినే మోసం చేస్తున్నారు. ఇలా భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. పరాయి వారితో క్షణిక సుఖం కోసం పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే తమ వివాహేతర సంబంధాన్ని అడ్డు ఉన్నారని భాగస్వామిని, కన్నపిల్లలను హత్య చేయడానికి వెనుకాడటం లేదు. ముఖ్యంగా కొందరు భర్తలు తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భార్యలను చంపేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తాజాగా ఓ మహిళ బలైంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ఢిల్లీబాబు(48) నగరికి చెందిన హేమలత (43)కు 2000లో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు ఇంజనీరింగ్ పూర్తిచేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కవలలూ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశారు. ప్రస్తుతం ఢిల్లీరాజు ఎస్‌ఆర్‌పురంలోని పుల్లూరు జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. హేమలత చిత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.
ఢిల్లీబాబుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో హేమలత దాదాపు పదేళ్లుగా ఢిల్లీబాబుతో మాట్లాడడం లేదు. వారు ఇద్దరూ నేరుగా మాట్లాడుకోకపోయినా నిత్యం ఘర్షణ పడుతుండేవారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి కూడా మరోసారి వారిద్దరు ఘర్షణ పడ్డారు. శనివారం ఉదయం పెద్ద కుమారుడు తిరుపతికి వెళ్లగా.. మరో కొడుకు ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయాడు. ఇదే అదునుగా భావించిన ఢిల్లీబాబు అప్పుడే స్నానం చేసి బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఆమె తల,మెడ, గొంతుపై నరికేశాడు. సమాచారం అందుకున్న స్థానికులు.. వారి ఇంటికి వెళ్లి.. సుత్తితో తాళం పగలగొట్టి చూడగా హేమలత హృదయవిదారకస్థితిలో చనిపోయి కనిపించింది. నిందితుడు ద్విచక్రవాహనంలో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే నల్గొండలో బావతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. కట్టుకున్న భర్తను చంపేసింది. ఆ దారుణ ఘటన మరువక ముందే ఈ ఘోరం జరిగింది. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.