ఈ మధ్యకాలంలో అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కే వారి సంఖ్య బాగా పెరిగింది. కష్టపడి పని చేసి సంపాదించడం చేత కాక.. అక్రమ మార్గంలో డబ్బులను సంపాదిస్తున్నారు. మరికొందరు అయితే అర్హత లేకున్న ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. ఈ అవినీతి మార్గంలో మహిళ కూడా ఉన్నారు. తాజాగా ఓ మహిళ ఘనకార్యం చేసింది.
ఈ మధ్యకాలంలో అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కే వారి సంఖ్య బాగా పెరిగింది. కష్టపడి పని చేసి సంపాదించడం చేత కాక.. అక్రమ మార్గంలో డబ్బులను సంపాదిస్తున్నారు. మరికొందరు అయితే అర్హత లేకున్న ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. ఈ అవినీతి మార్గంలో మహిళ కూడా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి డబ్బులను పొందేందుకు ఓ మహిళ కన్నింగ్ ప్లాన్ వేసింది. పింఛన్ కోసం ఏకంగా బతికున్న భర్తను చనిపోయినట్లు అందరిని నమ్మించింది. చివరకు ఆమె కన్నింగ్ ప్లాన్ తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా కొండెపి మండలం వెన్నూరుకు చెందిన కంకిపాటి నారాయణకు మర్రిపూడి మండలం కూచిపూడి చెందిన ఓ మహిళతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కాగా.. తొమ్మిదేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. ఇక ఒంటరిగా ఉంటున్న సదరు మహిళ పింఛన్ కోసం ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. తన భర్త చనిపోయాడని జరుగుమల్లి మండలం ఎన్.ఎన్.కండ్రిక సచివాలయం సెక్రటరీ సంతకంతో ఉన్న మరణ ధృవీకరణ పత్రంతో కూచిపూడి సచివాలయంలో పింఛనుకు దరఖాస్తు చేసుకుంది.
ఇదే విషయం ఆమె భర్త నారాయణకు తెలిసింది. దీంతో అసలు కథ బయటపడింది. తాను బతికుండగానే చనిపోయినట్లు తన భార్య డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసిందని చెప్పాడు. అనంతంరం వెంటనే జరుగుమల్లి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం తాను జాతీయ ఉపాధి పథకం కింద పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నానని, ఒకవేళ వింతతువు పింఛను మంజూరై ఉంటే తన ఉపాధి పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ వాదన ఇలా ఉంటే.. అధికారుల వాదన మరోలా ఉంది. ఈ సంవత్సరం జారీ చేసిన డెత్ సర్టిఫికేట్లలో అతడి పేరు లేదంటున్నారు. ఒకవేళ అది నకిలీది కావొచ్చని అధికారులు అన్నారు.