దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండగ ఎంతో ఘనం జరిగాయి. వాడవాడలా శ్రీసీతా రాముల స్వామి వారుల విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. భక్తులతో రామ మందిరాలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. అయితే పలు చోట్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండగ ఎంతో ఘనం జరిగాయి. వాడవాడలా శ్రీసీతా రాముల స్వామి వారుల విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. భక్తులతో రామ మందిరాలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు కన్నులారా రాముల వారి కళ్యాణాన్ని వీక్షించి… పానకం, వడపప్పు ప్రసాదాలను స్వీకరించారు. ఇలా అన్ని ప్రాంతాల్లో నవమి వేడుకలు ఘనంగా జరుగుతుంటే కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నంద్యాల జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. అలానే గుజరాత్ లోని వడోదర్ లో శ్రీరాముడి శోభయాత్ర జరుగుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మల్లంపల్లిలో శ్రీరాముడి ఆలయం వద్ద ఇరువర్గల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అది కాస్తా పెద్దదిగా మారి..ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో వైసీపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో గాయపడిన వారిని డోన్ లోని ఆస్పత్రికి తరలించారు. ఎంతకి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు భారీగా మల్లంపల్లి గ్రామాన్ని మోహరించారు.
ప్రస్తుతం మల్లంపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇళ్ల మధ్యలో, పొలాల మధ్యలో పరస్పరం కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. అయితే ఈ గొడవ తల్తెతడానికి గల కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అలానే దాడులకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మల్లంపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు భయపడుతున్నారు.
అలానే గుజరాత్ రాష్ట్రంలోని వడోదర్ లో శ్రీరాముని శోభయాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఘర్షణ జరగడానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది మతపరమైన గొడవల, లేక వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలా? అనేది తెలియాల్సి ఉంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. వేడుకల్లో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.