కష్టాల్లో ఉన్న వారిని, సమస్యలతో సతమతమవుతున్న వారిని ఆదుకోవాలంటే.. బాగా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. కష్టాన్ని చూసి స్పందించే మనసు ఉంటే చాలు. ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవినంలో మనిషిలో మానవత్వం కనుమరుగువుతుంది. అందుకే.. కళ్ల ముందే ఎంతటి దారుణాలు చూసినా.. బండరాయిలా కదలకుండా ఉంటున్నాం. అయితే అందరూ ఇలానే ఉండరు. అన్నార్తులను, అభాగ్యులను చూసి చలించి.. తమకు ఉన్నదాంట్లోనే.. వారికింత పంచి.. సంతోషపడేవారు కొందరుంటారు. ఈ కోవకు చెందిన మహిళే తిరుపతికి చెందిన సుజాత. కళ్ల ముందు అభాగ్యులు కనిపిస్తే.. ఆమె హృదయం విలవిల్లాడుతుంది. వెంటనే తనకు తోచిన సాయం చేస్తుంది.
ఈ క్రమంలో తాజాగా రోడ్డు పక్కన.. సరైన తిండి, బట్టలు లేక.. మండుటెండలో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేని చిన్నారులు సుజాత దృష్టిలో పడ్డారు. వారిని చూసి కదిలిపోయిన ఆమె.. వెంటనే ఆ చిన్నారులకు ఆహారం, చెప్పులు, బట్టలు అందించి సాయం చేశారు. దీని గురించి ఫేస్‌బుక్‌లో షేర్ చేయండతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సుజాత తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన కథనం ఇక్కడ మీ కోసం..
ఇది కూడా చదవండి: చెప్పు దెబ్బలు ఖాయం అంటూ.. విజయసాయి రెడ్డికి బండ్ల గణేష్ హెచ్చరిక!
‘‘ఎందుకో ఈ పసిబిడ్డలను చూడగానే ఎవరెవరికో తీసుకెళ్తున్న ఆహారం, బట్టలు వీరికి ఇవ్వాలనిపించింది. ఎందుకో తెలియదు.. ఈ పసిబిడ్డలను చూడగానే ప్రాణం నిలబడిపోయినట్లు అనిపించింది. ఎంతో దీనంగా ఉన్న వీరిని పలకరిద్దాం అనిపించింది. ఒక అరగంటపాటు వీరితో గడిపిన ఆనందపుగడియలు మరువలేనివి. ఏమైనా తిన్నారా.. అంటే అక్కడి దగ్గర గుడిలో ప్రసాదం తిన్నామమ్మ అన్నారు వచ్చిరాని తెలుగులో. బిడ్డలకేమైనా ఇద్దాం అని బిస్కెట్స్, జ్యూస్ ఇచ్చాం. ఆ తర్వాత మీరు ఎక్కడ ఉంటారని.. ఆ చిన్నారుల తల్లిదండ్రులను అడిగితే.. పనిలేదు.. ఉండటానికి నీడ లేదు.. ఊరేళ్తున్నాం’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: మోహన్ లాల్ మంచి మనసు.. గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య!
‘‘వేరేవారి కోసం వండి తీసుకెళ్తున్న ఆహారం వారికి ఇచ్చాను.. సాయంత్రం అయినా తింటారు కదా అనే ఉద్దేశంతో. స్నేహితురాలు అక్కడక్కడ తీసి పెట్టిన పాత చెప్పులు, మా దగ్గరున్న బట్టలు, మాకు చేతనైనంత మేరకు.. వారి చేతి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపాము. ఇక్కడే ఉంటే పని దొరికితే మళ్లీ కలవండి అని అడ్రస్ ఇచ్చి వచ్చాం. పసిబిడ్డల నవ్వులు.. ఆ బిడ్ఢలను చేరదీస్తున్నందుకు వారి తల్లిదండ్రులు పడిన ఆనందం నేను అక్కడ గమనించలేదుగాని.. ఈ ఫోటోల్లో చూస్తే ఎంతో సంతోషంగా అనిపించింది. నన్ను నా ఆనందాన్ని చూస్తూ. నాకే తెలియకుండా ఫోటోలు తీస్తూ.. మురిసిపోతున్న స్నేహితురాలు దొరకడం నాకు ఒక వరమే. నా భుజంపై వాలి కదలక మొదలక కొన్ని నిమిషాలు పడుకున్న పసిబిడ్డ నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది’’ అంటూ ఆ చిన్నారులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది సుజాత.
ఇది కూడా చదవండి: అద్భుతం: చెట్టు లో నుండి ధారళంగా నీరు..వీడియో వైరల్!
ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. సుజాత మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఈ పోస్టుకు ఇప్పటికే వేలాది లైకులు, కామెంట్స్‌తో పాటు వేలల్లో షేర్ చేస్తున్నారు. సాయం చేయాలంటే.. బాగా డబ్బుండాలనుకునేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు సుజాత. ఆమె సేవా స్ఫూర్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.