గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే చిన్న తప్పిదాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది చనిపోవడం, వికలాంగులుగా మారడం.. అనాధలు మిగిలిపోతున్న విషయం తెలిసిందే. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు.
దేశంలో ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అని అధికారులు చెబుతున్నారు. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినంగా పాటిస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి ఫైన్స్ వేస్తున్నా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. దీనికి సంబంధింని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి రూరల్ మండలం పూతలపట్టు నాయుడుపేట ప్రధాన జారతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అవిలాల నాలుగు రోడ్ల ప్రధాన కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అడపారెడ్డి పల్లి నుంచి ప్రయాణీకులతో తిరుపతికి బయలుదేరింది ఆర్టీసీ బస్సు. చంద్రగిరి నుంచి రేణుగుంట వైపు వెళ్తున్న డీసీఎం అవిలాల వద్ద నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటుతున్న బస్సును ఢీ కొట్టాడు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ గుద్దుకొని బోల్తా పడింది.
బస్సు అద్దాలు పగులగొట్టి అందులో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకు వచ్చారు.. ఆ సమయంలో కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డీసీఎం లో ఉన్నవారికి కూడా గాయాలు అయ్యాయి. అయితే అతి వేగమే ఇందుకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై ఎం.ఆర్.పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.