అభిమానులందూ భారతీయ అభిమానులు వేరు అనే మాట మనకు సరిగా సరిపోతుంది. సినిమాలు, క్రీడలు, రాజకీయాలు ఇలా ప్రతి రంగం వారికి భారతదేశంలో అభిమానులు ఉంటారు. వారు కూడా మాములూ అభిమానులు కారు.. తమ ప్రియతమ నటుడు, ఆటగాడు, నేత కోసం ప్రాణాలు ఇచ్చేంత వీరాభిమానులు ఉంటారు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. ఇలాంటి ఫ్యాన్స్ కారణంగానే స్టార్ హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ మరో రేంజ్‌లో ఉంటాయి.
అలాంటి వీరాభిమానులు మెండుగా ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తాజాగా ఆయన నటించిన అఖండ చిత్రం థియేటర్లలో మోత మోగించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినిమాను విడుదల చేయాలా వద్దా అని నిర్మాతలు వెనకాముందు ఆడుతున్న సమయంలో బాలయ్య.. ధైర్యం చేసి.. అఖండను థియేటర్లలో విడుదల చేసి.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అటు ఓటీటీలో కూడా అఖండ మోత మోగిస్తోంది.ఇది కూడా చదవండి : బాలయ్య సినిమా కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్స్!
అఖండతో భారీ విజయాన్ని సాధించిన బాలయ్యను చూసి ఉప్పొంగిపోయిన ఓ అభిమాని.. బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుకోవడం కోసం వినూత్న ఆలోచన చేశాడు. తిరుపతికి చెందిన సదరు అభిమాని.. బాలయ్య లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అఖండ పేరుతో ఓ హోటల్ ని ప్రారంభించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఈ ప్రయత్నంపై మిగతా బాలయ్య ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించడమే కాక.. హోటల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి.
అభిమానుల అభిమానానికి హద్దులే లేవు..❤️
ఇది తిరుపతి లో ఓ అభిమాని తన హోటల్ కి. ఏకంగా మన బాలయ్య సినిమా పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.#NandamuriBalakrishna #Akhanda pic.twitter.com/kfKEBBTxaT— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) February 2, 2022
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా నటించారు.సినిమా లైఫ్ టైమ్ రెండు మూడు వారాలకు చేరుకున్న నేటి రోజుల్లో అఖండ ఏకంగా 103 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుంది. అలాగే వసూళ్ల పరంగానూ రూ.200 కోట్లను సాధించింది.
ఇది కూడా చదవండి : బాలయ్య షోకి గెస్ట్ గా Jr. యన్టీఆర్ రాకపోవడానికి కారణం..
ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.