ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో వివిధ వేషధారణలో కనిపిస్తుంటారు. అలా వేషధారణల్లో కనిపించే విషయంలో తిరుపతి మాజీ ఎంపీ శివ ప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్రాన్నికి తెలియజేసే సమయంలో విచిత్రమైన వేషధారణలతో వెళ్లి వినతి పత్రం సమర్పించే వారు. అలా ప్రతి సందర్భంలో పలు వేషధారణలతో కనిపించి శివప్రసాద్ వార్తలో నిలిచారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి సైతం అదే బాటల నడిచారు. కానీ ఇక్కడ సమస్యల విషయంలో కాదు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర సందర్భంగా తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి వెంకన్న వేషధారణలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు గత కొన్నిరోజుల నుంచి శోభాయమానంగా సాగుతున్నాయి. ఈ జాతరకు భక్తులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మాతంగి దొర బండ, తోటి బైరాగి సున్నపు కుండలు లాంటి వేషధారణలో ఇక్కడికి వస్తారు. ఇలా వేషధారణ చేయడం వల్ల చిన్న పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా, అందరూ సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈసారి కూడా భక్తులు వివిధ వేషాధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వివిధ వేషధారణలో గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: నారాయణకు బెయిల్.. హైకోర్టుకు వెళ్తామన్నా సజ్జల!ఆదివారం ఎంపీ గురుమూర్తి కూడా..గంగమ్మకు సోదరుడైన శ్రీవెంకటేశ్వర స్వామి వేషం ధరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీసమేతంగా వెళ్లి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. ప్రస్తుతం ఎంపీ గురుమూర్తి.. వెంకన్న వేషధారణలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రజాప్రతినిధులు వివిధ వేషధారణల్లో కనిపించడపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.