SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Tirumala Temple Drone Vidoe Issue Police Filed A Case

తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

    Updated On - Mon - 23 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

తిరుమల ఆలయ డ్రోన్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం కూడా ఆలయంపై డ్రోన్లు, విమానాలు ఎగరవేయడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసలు ఆ దృశ్యాలు నిజమైనవేనా? ప్రస్తుతానివేనా? అనే అంశాలను తెలుసుకునేందుకు ఫారెన్సిక్ విభాగానికి పంపడం జరిగింది. మరోవైపు తిరుమల ఆలయ డ్రోన్ దృశ్యాలను వైరల్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ టీటీడీ ఛైర్మన్‌ హెచ్చరించారు.

తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అవి ఒరిజనల్ దశ్యాలా లేక పాత ఫొటోల ద్వారా వీడియో రూపొందించారా అనే అంశాలు తెలుసుకునేందుకు ఫారెన్సిక్ పంపామన్నారు. మరోవైపు ఈ ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను వైరల్ కావడంపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టీటీడీ చేసిన ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీసులు ఐకాన్ అనే సంస్థకు చెందిన కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, ఆలయ భద్రతా నిబంధన ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కిరణ్‌ హైదరాబాద్ లో ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. టీటీడీ చర్యలు మొదలు పెట్టింది. తిరుమల శ్రీవారి దేవాలయ భద్రతా వలయంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించేందుకు పరిశీలన చేస్తోంది. ఆలయ భద్రతా నిబంధనలు ఉల్లంఘించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్ నెలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వే కోసం టీటీడీ ఓ ప్రైవేట్ సంస్థకు క్రాంట్రాక్ట్ ఇచ్చింది. అందులో భాగంగా డ్రోన్లతో సర్వే నిర్వహించారు. అయితే ఆ సమయంలో కొందరు కావాలనే డ్రోన్ల సాయంతో ఆలయం దృశ్యాలను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డు పైనుంచి డ్రోన్లను ఎగరవేసినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచే ఆలయ దృశ్యాలను రికార్డు చేశారంటున్నారు. ఎవరైనా బాధ్యులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. మరో రెండ్రోజుల్లో ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

  • Andhra Pradesh
  • Drone
  • Tirumala
  • Ttd
  • YV Subbareddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభుత్వం గ్రామాలకు రూ.21 లక్షలు ఇస్తుంది! ఈ పథకం గురించి తెలుసా?

ప్రభుత్వం గ్రామాలకు రూ.21 లక్షలు ఇస్తుంది! ఈ పథకం గురించి తెలుసా?

  • రాష్ట్రపతి ప్రశంసలు పొందింది.. కానీ భర్త వేధింపుల నుండి తప్పించుకోలేకపోయింది!

    రాష్ట్రపతి ప్రశంసలు పొందింది.. కానీ భర్త వేధింపుల నుండి తప్పించుకోలేకపోయ...

  • కడపలో దారుణం.. నడిరోడ్డుపై ఇద్దరి వ్యక్తుల హత్య!

    కడపలో దారుణం.. నడిరోడ్డుపై ఇద్దరి వ్యక్తుల హత్య!

  • శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌ కలకలం!

    శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌ కలకలం!

  • మరోసారి నిరాశ.. బడ్జెట్‌ 2023లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులివే..!

    మరోసారి నిరాశ.. బడ్జెట్‌ 2023లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులివే..!

Web Stories

మరిన్ని...

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!
vs-icon

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

తాజా వార్తలు

  • K Viswanath Passed Away: కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

  • త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గొడవ ఈరోజుకీ తేలలేదు: పవన్ కళ్యాణ్

  • మీ నాన్నని చూసి నేర్చుకో.. పరువు తీయకంటూ షారుక్ ఖాన్ కొడుకు పై నెటిజన్స్ ఫైర్..

  • రికార్డు ధరకు పఠాన్ ఓటీటీ రైట్స్? స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఇదే!

  • ఓటీటీ వీకెండ్ ధమాకా.. రేపు ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. వెళ్లొచ్చు! 2 బ్యాటరీలతో వస్తున్న సూపర్ వెహికల్!..

  • ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత!

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam