ఓ వైపు ఎండలు మండిపడుతుంటే.. మరో వైపు వానలు దంచికొడుతున్నాయి. హమ్మయ్య అనుకునే లోపు మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్నిచూపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ వింత వాతావరణాన్ని చూసి ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడుతోంది. తాజా నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.. అయితే
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఓ వైపు ఎండలు మండిపడుతుంటే.. మరో వైపు వానలు దంచికొడుతున్నాయి. హమ్మయ్య అనుకునే లోపు మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ వింత వాతావరణాన్ని చూసి ప్రజల్లో కూడా గందరగోళం నెలకొంది. తెలంగాణాలో ఎప్పడూ లేని వడగళ్ల వానను ప్రజలు చూస్తుండగా.. అటు ఎండలతో మండే రాయల సీమ ప్రాంతం కూడా వేసవిలో వర్షాలతో తడిసి ముద్దవుతుంది. తాజాగా ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లుల వర్షాల నుండి తేలికపాటి వానలు కురిశాయి.
నంద్యాల జిల్లాలో ఓ కుటుంబం పెను విపత్తు నుండి తృటిలో తప్పించుకుంది. ఈ నెల 22న తెల్లవారు జామున జిల్లాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ సమయంలో పగిడ్యాల మండలం ముచ్చు మర్రు గ్రామంలో ఓ ఇంటిపై భారీ పిడుగు పడింది. ఆ సమయంలో శేషన్న మంచంపై పడుకుని ఉన్నాడు. అయితే ఆ పిడుగు శ్లాబును చీల్చుకుని మరీ ఇంట్లో పడింది. దీంతో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏంటనీ మెలుకువ వచ్చి చూసే సరికి మంచం పక్కన పిడుగు పడి ఉంది. దీంతో శేషన్న పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు అయ్యింది. పిడుగు తీవ్రకు ఇంటికి పెద్ద రంధ్రంలా ఏర్పడింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.