మనిషి టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు సాగుతున్నా.. దేవుడు అంటే అమితమైన భక్తిభావం చూపిస్తుంటారు. అందుకే మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతినిత్యం దూపదీపాలతో దేవుళ్లు.. దేవతలను ఆరాదిస్తుంటారు. అలాంటి దేవాలయానికి కన్నం వేయడానికి చూసిన ఓ దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. గుడిలోకి వెళ్లేందుకు ప్లాన్ వేసి కిటికీ రంద్రంలో అడ్డుంగా ఇరుక్కుపోయాడు. ఇక ముందు, వెనక్కి రాలేక మద్యలో దిక్కుతోచని స్థితిలో స్థానికులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడిలో జామి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడిలో జామి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. పాపా రావు అనే ఒక దొంగ దేవాలయంలో అమ్మవారి నగలు చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. దొంగిలించిన సొత్తుతో కిటికీ కన్నంలో నుంచి బయటకు రావాలని చూశాడు.. కానీ కన్నంలో ఇరుక్కు పోయాడు.. పాపారావు అవస్థను స్థానికులు గమనించారు.. తగిన శాస్తి జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.