కరోనాతో మూత పడ్డ సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగటంతో ప్రభుత్వం అప్పట్లో లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో విద్యాసంస్థలతో పాటు సినిమా థియేటర్లకు కూడా తాళం పడింది. ఇక చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో జనాలు కాస్త ఊపరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది.
ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి మూతపడ్డ సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు జులై 8వ తేదిన ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ఇక ఎట్టకేలకు సినిమా హాళ్లు తెరుచుకుంటాయనుకున్నా తరుణంలోనే ఎగ్జిబీటర్లకు నిర్మాతలకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో మళ్లీ వెనక్కి తగ్గారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం 50 శాతం సిటింగ్ సామర్థ్యంతో జులై 31 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు మరోసారి అవకాశాన్ని ఇచ్చింది.
కరోనా నిబంధనలను పాటిస్తూ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో కొన్ని థియేటర్ల యజమానులు మాత్రం 50 శాతం సిటింగ్‌తో థియేటర్లు తెరిస్తే మాకు నష్టాలు తప్పవని వారు వాపోతున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలంటూ ప్రముఖ సినీ నటుడు నానీ స్పందించిన విషయం తెలిసిందే. ఇయనతో పాటు టాలీవుడు ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి సైతం మూత పడ్డ సినిమా థియేటర్లు వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌తోనే ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.