విద్యా బుద్దులు నేర్పాల్పిన గురువు కీచకుడు అవుతున్నాడు. పిల్లలను వేధిస్తూ.. వారి పట్ల ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఆ పాఠశాల విద్యార్థులు మాత్రం..
‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర’ పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు కొంత మంది గురువులు. విద్యా బుద్దులు నేర్పాల్పిన గురువు కీచకుడు అవుతున్నాడు. పిల్లలను వేధిస్తూ.. వారి పట్ల ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. మార్కుల పేరిట బెదరగొట్టి వారిని లొంగదీసుకుంటున్నారు. ఇలాంటి కొంత మంది చీడ పురుగుల వల్ల విద్యా వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. వీరి వేధింపులు తట్టుకోలేక కొంత మంది చదువుకు దూరం అవుతున్నారు. ఉపాధ్యాయుడు గురించి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోవడంతో పంటి బిగువున భరిస్తున్నారు. అయితే ఆ పాఠశాల విద్యార్థులు ఈ ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ నిరసన చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం డి.ఆర్ వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయుడు (హెడ్ మాస్టర్) బలరాం లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం ఇటీవల బయటపడగా.. ప్రధానోపాధ్యాయుడిని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడటంపై మండిపడ్డారు. అనంతరం పోలీసులకు, ఉన్నతాధికారులకు స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు.
డి.ఆర్ వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిందడ్రులు, స్థానికులు నిరసన చేపట్టారు. ఈ హెచ్ ఎం మాకొద్దని.. పాఠశాలకు వస్తే లోపలికి అడుగుపెట్టనీయమని విద్యార్థులు నినాదాలు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న హెచ్ ఎం బలరాం పాఠశాలకు శనివారం సెలవు పెట్టారు. కాగా, ఆ హెచ్ ఎం ఉంటే తాము పిల్లలను పాఠశాలలకు పంపమని తల్లిదండ్రులు సైతం చెబుతున్నారు.