ఏపీ సర్కార్ గ్రామ సచివాలయం పేరుతో ఓ కొత్త అడుగుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయంలో ఎలాంటి సమస్య గురించి అయినా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా అలా సచివాలయాలు లేక అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇలా అద్దెకు తీసుకున్న భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
ఇక ఇంతటితో ఆగకుండా ఏకంగా గ్రామ సచివాలయానికే తాళం వేసి అధికారులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో ఓ మహిళ సచివాలయం కోసమని తన సొంత ఇంటిని అద్దెకు ఇచ్చింది. అయితే గత 10 నెలల నుంచి అద్దె చెల్లించడం లేదని, అడిగితే ఈ రోజు, రేపు అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఎలా సమధానం చెప్పాలో అర్థం కావడం లేదని, దయచేసి ఇంటి అద్దె ఇవ్వాలంటూ ఆ మహిళ అనేకసార్లు తెలిపింది. అయినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడంలేదని ఆ మహిళ తెలిపింది.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీతో కలిసి పనిచేయలేం.. పాతవన్నీ మర్చిపోలేం: YCP నేత శివ భరత్ రెడ్డి
ఇదే విషయంపై గతంలో అనేకసార్లు ఆర్డీవో వద్దకు వెళ్లానని నాకేలాంటి సంబంధం లేదని అంటున్నారని ఆ మహిళ వాపోయింది. ఇక ఇలాగైతే అధికారులు దిగిరారని భావించిన మహిళ ఏకంగా సచివాలయాని తాళం వేసినట్లుగా తెలిపింది. ఇలా గతంలో అనేకసార్లు తాళం కూడా వేశానని ఆ మహిళ వాపోయింది. సీఎం సొంత జిల్లాలోనే వెలుగు చూసి ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సయ్య పాలెంలోని ఓ యజమానికి ఏకంగా మూడేళ్ల నుంచి అద్దె చెల్లించడం లేదని దీని కారణంగానే సచివాలయానికి తాళం వేసినట్లుగా యజమాని తెలిపాడు. ఇలా వరుస ఘటనలు పునరావృతం అవుతుండడంతో ప్రజలు ప్రభుత్వంపై ఒంటి కాలుపై లేస్తున్నారు. ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.