ఈ కాలం యువత తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. స్కూల్ ఏజ్ నుంచే ప్రేమలో మునిగి తేలుతూ ఇదే జీవితమంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇక దీంతో పాటు టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కడం, తక్కువ ధరకే మొబైల్ లు దీనికి తోడు టెలీకాం కంపెనీల నుంచి వాడినంత మొబైల్ డేటా లబిస్తోంది. ఇక ప్రధానంగా ఇవే యువత చెడిపోవటానికి మూల కారణమని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా చాటింగ్ లు, మీటింగ్ లు అంటూ ప్రేమలో మునిగి తేలటం ఆ తర్వాత గొడవలు పడి విడిపోవటం చేస్తున్నారు. అచ్చం ఇలాగే తాజాగా రాజమండ్రిలో ప్రియురాలికి యువకుడికి మధ్య ఓ గొడవ జరిగిందట. దీంతో వాట్సప్ ద్వారా ఎన్ని సందేశాలు పంపినా ప్రియురాలు కరగకపోవటంతో కరుడుగట్టిన ఈ ప్రియుడు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రిలోని ఎవీ అప్పారావు రోడ్, దానవాయిపేట ప్రాంతాల్లో రోడ్ కు ఇరు వైపుల ఉన్న గోడలపై ప్రియుడు వినూత్నంగా పోస్టర్లు అంటించి ప్రియురాలికి క్షమాపణలు చెప్పాడంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
సారీ.. మోసం చేయలేదంటూ అంటించిన ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలంగా మారాయి. అసలు ఈ పోస్టర్లు అంటించింది ఎవరు? ఎందుకు అంటించి ఉంటారని స్థానికులు తలలు పట్టుకున్నారు. ఇక ఆలోచింప జేస్తున్న ఈ పోస్టర్లపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏదేమైన ఓ ప్రియుడు ప్రియురాలికి వినూత్నంగా చెప్పిన క్షమాపణలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఇలా ప్రియురాలిని క్షమించమంటూ ప్రియుడు అంటించిన ఈ పోస్టర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.