ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా వస్తున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెలవులను అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా ఈ నెల 25న క్రిస్మస్ పండగ ఉండడంతో క్రిస్టియన్ మిషనరీలకు విద్యాశాఖ తాజాగా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల23 నుంచి 30 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ప్రకటించింది.
అయితే ఈ సెలవులు క్రిస్మస్ మిషనరీలకు మాత్రమే వర్తిస్తాయని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో పాటు వచ్చే నెల సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 10 నుంచి 15 వరకు ఈ సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవులు క్రిస్టియన్ మిషనరీలకు తప్పా మిగత పాఠశాలలకు వర్తిస్తాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇక క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో విద్యార్థుల ఆనందంలో మునిగి తేలుతున్నారు.