రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల మాట్లాడుతూ.. ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం చెడగొట్టిందని, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకపోగా పరిశ్రమల స్థాపనకు ముందుకు కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోయాయంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతో చివరకి సినిమా టిక్కెట్ల వ్యవహారంలో తలదూర్చిందని ధ్వజమెత్తడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో కనకమేడల ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల నియంత్రణ అధికారాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుందని.. స్టార్ యాక్టర్, జనసేన రాజకీయ పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రభుత్వం ఉద్దేశపూరకంగానే అడ్డుపడుతోందని అన్నారు. టికెట్ల రేట్ల నియంత్రణ అనేది ప్రభుత్వం చేతికి వెళ్లేసరికి సినిమాలను వాయిదాపడే పరిస్థితి నెలకొందని కనకమేడల ఆరోపించారు.
#PawanKalyan సినిమాలపై జగన్ మోహన్ రెడ్డి కక్ష గట్టాడు, ఆయన సినిమాలని అడ్డుకోవడానికి కొత్త జీవోలు కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో బిజినస్ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నారు.
– రాజ్యసభలో ఎంపీ కనకమేడల pic.twitter.com/1QHuLIPb3E
— బెజవాడ కుర్రోడు 💥 (@AyanPawanist_) February 7, 2022
తాజాగా కనకమేడల ప్రసంగంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ పొత్తు కలిసిందని.. అప్పట్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పిన చంద్రబాబు మాటలు మరోసారి చర్చలకు దారితీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా గురించి కనకమేడల మాట్లాడేసరికి రాజ్యసభ వేదికగా జనసేనకి టీడీపీ అండ బయట పడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే సీఎం జగన్ ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ సినిమాలను కావాలనే అడ్డుకుంటుందని.. రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించడంతో వివాదం ముదిరేలా ఉందని అంటున్నాయి సినీవర్గాలు. మరి ఎంపీ కనకమేడల జగన్ ప్రభుత్వం పై ఆరోపించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.