టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. ఆర్టీసీ బస్సులో.. మహిళపై దౌర్జన్యానికి పాల్పడిన వీడియో తాజాగా వైరలవుతోంది. సదరు ఎమ్మెల్యే మహిళ చేతిలోంచి ఫోన్ లాక్కుని.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన సదరు మహిళ.. ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని లాగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ ఎమ్మెల్యేపై తిరగబడింది. ఆయన చొక్కా పట్టుకుని వెనక్కు లాగింది. తన మొబైల్ తీసుకోవడంపై సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రైతుల యాత్ర గురించి బస్సులో ప్రయాణిస్తోన్న మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దాంతో రామానాయుడు మహిళలతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న ఓ మహిళ ఈ వివాదాన్ని వీడియో తీయడంతో.. ఎమ్మెల్యే సదరు మహిళ ఫోన్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేపట్టిన రైతుల మహా పాదయాత్రకు అక్కడక్కడా నిరసన సెగలు తగులుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ పాదయాత్రను తప్పు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోనూ అమరావతి రైతులకు నిరసనలు ఎదురయ్యాయి. పాదయాత్రను తప్పుబడుతూ వైసీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు నల్లబెలూన్లు ఎగురవేశారు. గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేశారు.
అలానే ఆచంట నియోజకవర్గంలోనూ రైతుల పాదయాత్రకు నిరసనలు ఎదురయ్యాయి. పోడూరు మండలం కవిటం గ్రామం మీదుగా పాదయాత్ర సాగుతున్న సమయంలో అక్కడి స్థానికుల్లో కొందరు ఈ పాదయయాత్రను తప్పుబట్టారు. పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు.. అమరావతి రైతులకు పలు ప్రశ్నలు సంధించాడు. గతంలో తమకు అన్యాయం జరిగిందనీ.. మళ్లీ తమకు అన్యాయం చేయవద్దంటూ అమరావతి రైతులను కోరాడు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం సరైందని అనటంతో.. ప్రయాణికుడు, అమరావతి రైతుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది.
మహిళ పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం
అమరావతి పాదయాత్ర పాల్గొన్న రామానాయుడిని బస్ లో నుంచి ప్రశ్నించిన మహిళ
ఆమె ఫోన్ లాక్కున్న రామానాయుడు
ఫోన్ కోసం MLA షర్ట్ , పచ్చ కండువా పట్టుకొని లాగిన మహిళ#paalakollu#nimmalaraamanaidu #amaravathipadayatra #tdp pic.twitter.com/8j1bTJf7z8— VenkataReddy karmuru (@Venkat_karmuru) October 10, 2022