ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 3 స్థానాల్లో రెండింట టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే పశ్చిమ రాయలీసమ స్థానంలో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా కొనసాగుతోంది.
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 3 స్థానాల్లో పట్టభద్రుల ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి 5 రౌండ్లు కౌంటింగ్ పూర్తి కాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు- వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పై 20,310 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇంక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 5 రౌండ్లు ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్- వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై 16,929 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం టీడీపీ- వైసీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో మాత్రమే కొనసాగుతున్నారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానాల కౌటింగ్ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆధిక్యంలోకి రావడంపై మాట్లాడుతూ.. ప్రజల్లో మార్పు మొదలైందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. టీడీపీ తలపెడుతున్న ప్రతి కార్యక్రమంలో బాలయ్య యాక్టివ్ గా పాల్గొంటున్నారు. నిరసనల్లో కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.
అసెంబ్లీ వద్ద మీడియాతో ఎమ్మెల్యే బాలకృష్ణ చిట్ చాట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడిపి ముందజలో ఉండటంతో స్పందించిన బాలకృష్ణ
ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది ఎమ్మెల్యే బాలకృష్ణ pic.twitter.com/gJO2EdInm9
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2023